AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో రానున్న 12 రోజులు కీలకం.. మళ్లీ జోరు పెంచిన చైనా వైరస్.. ఆ ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..

దేశం లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభించడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తోంది. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌ , కర్నాటక , కేరళ , అసోం రాష్ట్రాల్లో..

ముంబైలో రానున్న 12 రోజులు కీలకం.. మళ్లీ జోరు పెంచిన చైనా వైరస్.. ఆ ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..
COVID
Sanjay Kasula
|

Updated on: Feb 22, 2021 | 10:19 PM

Share

Covid India Active Cases:  దేశం లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభించడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తోంది. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌ , కర్నాటక , కేరళ , అసోం రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరగడంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ హాజరయ్యారు. కోవిడ్‌ నియంత్రణతో పాటు వ్యాక్సిన్‌ పంపిణీపై ఈ సమావేశంలో చర్చించారు.

ముంబైలో రానున్న 12 రోజుల కీలకమని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. రూల్స్‌ను ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వరుడు,వధవు కుటుంబసభ్యులపై కేసులు పెడుతామని తెలిపారు. ముంబైలో కొత్త రకం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు.

మహారాష్ట్రలో కోవిడ్‌ కేసుల విజృంభనతో అమరావతి , అకోలా , బుల్దానా , వాషిం,యవత్‌మాల్‌ జిల్లాల్లో సంపూర్ణ లౌక్‌డౌన్‌ విధించారు. కర్ణాటక ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గానూ పెళ్లి మండపాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేయనుంది. వివాహాది శుభకార్యాలు, ఇతర సమావేశాల్లో 500 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదని, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా కేరళతో ఉన్న 13 సరిహద్దులను కర్నాటక ప్రభుత్వం మూసేసింది.

మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ పత్రాన్ని చూపించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం సరిహద్దుల్లో ఐదు చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసింది. ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇదే నిబంధనలు అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, కేరళలో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అధిక సంఖ్యలో టెస్టింగ్, ట్రేసింగ్ చేపట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.

ఇది కూడా చదవండి

Five Vegetables Easy to Grow: ఇంట్లోనే ఈ ఐదింటిని చాలా సులభంగా సాగు చేద్దాం.. ఇవి ఎలా అంటే…