Corona Virus: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు జాగ్రత్త.. కరోనా ఎక్కువ కాలం బతికుండేది మొబైల్‌ స్క్రీన్‌ పైనే అని తెలుసా..?

కరోనా వైరస్‌ బాహ్య ప్రపంచంలో ఎంతసేపు సజీవంగా ఉంటుందనే అంశంపై పలువురు పరిశోధకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే ఉన్నారు. శాస్ర్తవేత్తల అభిప్రాయం ప్రకారం వైరస్‌ జీవితం కాలం ఒక్కో ఉపరితలంపై ఒక్కోలా...

  • Narender Vaitla
  • Publish Date - 7:50 am, Tue, 23 February 21
Corona Virus: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు జాగ్రత్త.. కరోనా ఎక్కువ కాలం బతికుండేది మొబైల్‌ స్క్రీన్‌ పైనే అని తెలుసా..?

Corona Virus Live Long Time On Smart Phone Screen: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. ఒకప్పుడు మాస్క్‌ పెట్టుకునే వారిని వింతగా చూసేవారు. ఇప్పుడు.. పెట్టుకోని వారిని వింతగా చూస్తున్నారు. అంతేనా.. పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజర్‌ చేసుకుంటుండం, స్ప్రే చేస్తుండడం అంతా కొత్తగా కనిపిస్తోంది.
ఇక కరోనా వైరస్‌ బాహ్య ప్రపంచంలో ఎంతసేపు సజీవంగా ఉంటుందనే అంశంపై పలువురు పరిశోధకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే ఉన్నారు. శాస్ర్తవేత్తల అభిప్రాయం ప్రకారం వైరస్‌ జీవితం కాలం ఒక్కో ఉపరితలంపై ఒక్కోలా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. తాజాగా వైరస్‌ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పైనే ఎక్కువ కాలం జీవిస్తుందని పరిశోధకులు గుర్తించారు. సార్స్‌, కొవిడ్‌ వంటి వైరస్‌ల జీవిత కాలం సాధారణ గాజు గ్లాస్‌ ఉపరితంల కంటే స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పైనే ఎక్కువగా ఉంటుందని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఇంటర్‌ డిసిప్లనరీ రీసెర్చ్‌ గ్రూప్‌ శాస్ర్తవేత్తలు గుర్తించారు. సార్స్‌ కూడా కొవిడ్‌ లాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధి అని, ఇది కూడా తుమ్మడం, దగ్గడం ద్వారానే ఇతరులకు వ్యాపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. గాలిలోని తేమ, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వైరస్‌ జీవిత కాలం వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా ఉంటుందని ఐఐటీ పరిశోధకులు తమ రీసర్చ్‌లో గుర్తించారు. ఐఐటీ హైదరాబాద్‌ మెకానికల్‌, ఏరో స్పేస్‌ విభాగానిఇక చెందిన శాస్ర్తవేత్తలు పలు పరిశోధనలు చేసిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.

Also Read:
Corona Cases: వ్యాక్సిన్ వచ్చినా చావని కరోనా! పెరుగుతున్న కరోనా కేసులు.