Maharashtra: కరోనా నిబంధనలు పాటించకుండా వివాహ వేడుక.. బీజేపీ మాజీ ఎంపీ, మరో ఇద్దరిపై కేసు..
Former MP Dhananjay Mahadik: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి ఆంక్షలు విధించడంతోపాటు.. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా చర్యలు...
Former MP Dhananjay Mahadik: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి ఆంక్షలు విధించడంతోపాటు.. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో మాజీ ఎంపీ తన కొడకు వివాహ వేడుకను కరోనా నిబంధనలు పాటించకుండా నిర్వహించారు. దీంతో ఈ పెళ్లి వేడుక నిర్వహించిన బీజేపీ మాజీ ఎంపీ ధనంజయ్ మహాదిక్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 21న పూణేలో మాజీ ఎంపీ ధనంజయ్ మహాదిక్ కుమారుడి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, మాజీ దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, మరికొంతమంది వీఐపీలు హారయ్యారు. అయితే హాజరైన వారంతా మాస్కులు లేకుండా.. కరోనా నిబంధనలు పాటించకుండా కనిపించారు.
అనంతరం అధికారులు చర్యలు తీసుకున్నారు. కరోనా నియమాలు ఉల్లంఘించినందుకు బీజేపీ మాజీ ఎంపీ ధనంజయ్ మహాదిక్, లక్ష్మీ లాంజ్ యజమాని వివేక్ మగర్, మేనేజర్ నిరూపల్ కేదార్‌లపై మహారాష్ట్రలోని హడప్‌సర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి బాలకృష్ణ కదమ్ తెలిపారు.
Also Read: