టిక్‌టాక్, పబ్‌జీల మాయలో పడకండి.. సీఎం పిలుపు!
ఆన్లైన్ గేమింగ్ యాప్ పబ్‌జీ, వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లను పిల్లలు డౌన్‌లాడ్ చేయకుండా తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలంటూ గోవా ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ యాప్‌ల వల్ల పిల్లలకు భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో టిక్‌టాక్, పబ్‌జీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి నాయక్ అడిగిన ప్రశ్నకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ లిఖిత పూర్వక […]
ఆన్లైన్ గేమింగ్ యాప్ పబ్‌జీ, వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లను పిల్లలు డౌన్‌లాడ్ చేయకుండా తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలంటూ గోవా ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ యాప్‌ల వల్ల పిల్లలకు భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం అసెంబ్లీలో టిక్‌టాక్, పబ్‌జీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి నాయక్ అడిగిన ప్రశ్నకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వీటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.