అనుమానితుడైనా టెర్రరిస్టే … అమిత్ షా
ఉగ్రవాదంపై ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే దాని బాధ్యత అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మనమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక బిల్లులోని కొన్ని నిబంధనల్లో ఒకదానికి చేసిన సవరణలపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన.. టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా టెర్రరిస్టుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్ మెంట్ (చట్ట వ్యతిరేక […]
ఉగ్రవాదంపై ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే దాని బాధ్యత అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మనమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక బిల్లులోని కొన్ని నిబంధనల్లో ఒకదానికి చేసిన సవరణలపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన.. టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా టెర్రరిస్టుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్ మెంట్ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ ) బిల్లు పేరిట గల ఈ బిల్లును లోక్ సభ ఇటీవల ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. (ఈ బిల్లుకు అనుకూలంగా 284 ఓట్లు రాగా.. 8 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు). దీనిపై బుధవారం చర్చ సందర్భంగా విపక్షాలు చేసిన ఆరోపణలను, విమర్శలను అమిత్ షా ఖండించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో లింకు ఉందని ఎవరినైనా అనుమానిస్తే ఆ వ్యక్తిని కూడా ఉగ్రవాదిగానే ముద్ర వేయాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఇది దుర్వినియోగం కావచ్ఛునని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా దేశ వ్యతిరేకిగా ముద్ర వేయవచ్చునన్న ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా తొసిపుచ్చారు. అసలైన,,జెన్యూన్ వ్యక్తులను పోలీసులు వేధించరని అన్నారు. నిజానికి సామాజిక కార్యకర్తలు చాలామంది మంచి పనులు చేస్తున్నారని, కానీ అర్బన్ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్ఛరించారు.
ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడానికి అనువైన నిబంధన ఉండాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి దీనికి సంబంధించి ఓ ప్రొసీజర్ని పాటిస్తోంది. అమెరికాలోనూ ఇలాంటి రూల్ ఉంది. చివరికి పాకిస్తాన్, చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్..ఇలా పలు దేశాలు దీన్నిఅమలు చేస్తున్నాయి అని అమిత్ షా వివరించారు. కాగా-ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం తొందరపడిందని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆరోపించారు. దివంగత బీజేపీ నేత వాజ్ పేయి కూడా ఈ విధమైన నిబంధనను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.