Manipur Unrest: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల మధ్య హింస.. రంగంలోకి దిగిన ఆర్మీ..
‘మా రాష్ట్రం మండిపోతోంది. సహాయం చేయండి’ అని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను ట్వీట్‌లో అభ్యర్థించారు. షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతై వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు.
ఈశాన్య రాష్ట్రం మణిపుర్ తగులబడుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లర్లను అదుపు చేయడానికి ఆర్మీని రంగం లోకి దింపింది కేంద్రం. అసోం రైఫిల్స్‌ను కూడా పలు ప్రాంతాల్లో మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కన్పిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ఇంఫాల్‌తో సహా పలు ప్రాంతాలో కర్ఫ్యూ విధించారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. మణిపూర్ సీఎం బీరేంద్రసింగ్‌తో ఫోన్లో మాట్లాడారు అమిత్‌షా. మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఇంఫాల్, చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 8 వేల మందిని మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు. మణిపూర్‌లో హింసపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా రాష్ట్రం మండిపోతోంది. సహాయం చేయండి’ అని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను ట్వీట్‌లో అభ్యర్థించారు. షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతై వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు.
#WATCH | Indian Army & Assam Rifles undertook major rescue operations to evacuate more than 7,500 civilians of all communities relentlessly throughout the night to restore law & order in Manipur.
(Source: Indian Army) pic.twitter.com/SXtR7rjsE1
— ANI (@ANI) May 4, 2023
మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతై వర్గానికి అనుమతి లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..