#Priyanka Gandhi Vadhera: రాజ్యసభకు ప్రియాంక.. సోనియా సడన్ డెసిషన్

తన కూతురు ప్రియాంకా గాంధీ వధేరాను త్వరలో రాజ్యసభకు పంపనున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ..

#Priyanka Gandhi Vadhera: రాజ్యసభకు ప్రియాంక.. సోనియా సడన్ డెసిషన్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 15, 2020 | 2:35 PM

Congress to send Priyanka Gandhi Vadhera to Rajyasabha: ఆమె రావాలి.. కాంగ్రెస్ పార్టీని రక్షించాలి అంటూ నినదిస్తున్న పార్టీ శ్రేణుల అభ్యర్థనలు వినిపించాయో ఏమో అధినేత్రి సోనియా గాంధీ ఓ సడన్ డెసిషన్ తీసుకున్నారు. గత పదేళ్ళుగా క్రియాశీలకంగా వున్నా కూడా పార్టీని అధికారం దిశగా నడిపించలేకపోతున్న రాహుల్ గాంధీతోపాటు పార్టీలో తన తనయ ప్రియాంక గాంధీకి సమ ప్రాధాన్యమివ్వాలని సోనియా గాందీ నిర్ణయించారు. తనయుడు రాహుల్ గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తన కూతురు ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపాలని సోనియా గాంధీ తాజాగా నిర్ణయించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో అధికారంలో వుంది. మధ్యప్రదేశ్ నుంచి గానీ, రాజస్థాన్ నుంచి గానీ ప్రియాంకా గాంధీని రాజ్యసభకు నామినేట్ చేయించేందుకు సోనియాగాంధీ సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దిశగా నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ.. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఫోకస్ చేశారని చెప్పుకుంటున్నారు. అయితే.. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ పార్టీ లోక్‌సభ పక్షానికి సారథ్యం వహించడం లేదు. అదే విధంగా రాజ్యసభలోకూడా ప్రస్తుతం వున్న రాజ్యసభాపక్షం నేతగా గులాం నబీ ఆజాద్‌నే కొనసాగిస్తారని చెప్పుకుంటున్నారు.

Also read: Pawan Kalyan crucial comments on YCP-BJP friendship

ప్రియాంకను రాజ్యసభకు పంపుతుండడంతో గాంధీ కుటుంబం నుంచి తన తాత ఫిరోజ్ గాంధీ తర్వాత పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించిన రెండో వ్యక్తిగా ప్రియాంక నిలవబోతున్నారు. అయిన రెండు సభలకు ప్రాతినిధ్యం వహించగా.. ఆ తర్వాత ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు రాహుల్ గాంధీ కూడా ప్రజల్లోంచి నేరుగా ఎన్నికై లోక్‌సభలో అడుగుపెట్టిన వారే.