‘మెట్రో కార్యక్రమానికి నన్ను ఆహ్వానించరా ‘? నిప్పులు కక్కిన దీదీ
కోల్ కతాలో ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ లాంచ్ కార్యక్రమానికి బీజేపీ నేతలు తనను ఆహ్వానించకపోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు పట్టారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం లభించేలా చూసేందుకు తాను, తన సహచరులు ఎంతో శ్రమించామని ఆమె చెప్పారు. నేను రైల్వే మంత్రిగా ఉండగా.. దీని అప్రూవల్ కోసం దాదాపు కన్నీటి పర్యంతం కూడా అయ్యానన్నారు. ఈ నెల 13 న ఈ కారిడార్ ను కేంద్ర మంత్రి పీయూష్ […]
కోల్ కతాలో ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ లాంచ్ కార్యక్రమానికి బీజేపీ నేతలు తనను ఆహ్వానించకపోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు పట్టారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం లభించేలా చూసేందుకు తాను, తన సహచరులు ఎంతో శ్రమించామని ఆమె చెప్పారు. నేను రైల్వే మంత్రిగా ఉండగా.. దీని అప్రూవల్ కోసం దాదాపు కన్నీటి పర్యంతం కూడా అయ్యానన్నారు.
ఈ నెల 13 న ఈ కారిడార్ ను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రారంభించారు. దీనికి మర్యాదపూర్వకంగానైనా నన్ను ఆహ్వానించలేదని మమతా బెనర్జీ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2009-2011 మధ్య కాలంలో ఆమె రైల్వే మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గురువారం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన పీయూష్ గోయెల్..ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ యోజన వంటి కేంద్ర పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రాష్ట్ర ప్రజలు పొందకుండా వారి హక్కును ఈ ప్రభుత్వం కాలరాచిందని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులను అందించదలచామని, కానీ ప్రభుత్వం వీటిని అనుమతించకుండా అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలో కోటిమంది ప్రజలు లబ్ది పొందుతున్నారు అని ఆయన చెప్పారు. అయితే దీదీవీటిని ఖండిస్తూ.. ప్రజలకు ప్రయోజనం కలిగించే మెట్రో వంటి ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వాన్ని పక్కనపెట్టి బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తోందని తిప్పికొట్టారు.