AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Granite Mines: గ్రానైట్ దందాపై జగన్ ఉక్కుపాదం

Jagan government strong steps on Granite business: బీజేపీ ఎంపీ గరికపాటికి 286కోట్లు… టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటికి 303కోట్ల … టిడిపి మాజీ మంత్రి శిద్దా కుటుంబానికి 400 కోట్లు… వైసిపి నేత మారం వెంకారెడ్డికి 70 కోట్లు… ఇవన్నీ గ్రానైట్‌ క్వారీల్లో అక్రమంగా మైనింగ్‌ చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు. ఈ నోటీసులతో గ్రానైట్‌ వ్యాపారుల్లో కలకలం రేగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ ఇసుక, మైనింగ్‌ వ్యవహారాలపై కొరడా […]

Granite Mines: గ్రానైట్ దందాపై జగన్ ఉక్కుపాదం
Rajesh Sharma
|

Updated on: Feb 15, 2020 | 1:54 PM

Share

Jagan government strong steps on Granite business: బీజేపీ ఎంపీ గరికపాటికి 286కోట్లు… టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటికి 303కోట్ల … టిడిపి మాజీ మంత్రి శిద్దా కుటుంబానికి 400 కోట్లు… వైసిపి నేత మారం వెంకారెడ్డికి 70 కోట్లు… ఇవన్నీ గ్రానైట్‌ క్వారీల్లో అక్రమంగా మైనింగ్‌ చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు. ఈ నోటీసులతో గ్రానైట్‌ వ్యాపారుల్లో కలకలం రేగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ ఇసుక, మైనింగ్‌ వ్యవహారాలపై కొరడా ఝళిపించడంతో పాటు పక్కాగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో ప్రకాశంజిల్లా గ్రానైట్‌ క్వారీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ఏటా వేల కోట్ల రూపాయల్లో టర్నోవర్‌ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించవలసిన రాయల్టీని వందల కోట్లలో ఎగవేస్తున్నారని నిగ్గు తేల్చిన విజిలెన్స్‌ అధికారుల నివేదికల ఆధారంగా మైనింగ్‌ శాఖ గ్రానైట్‌, క్వారీ యజమానులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో రాజకీయపార్టీలకు చెందిన బడా నేతలు గ్రానైట్‌ క్వారీ యజమానులుగా ఉండటంతో రాజకీయంగా అలజడి మొదలైంది. ఫిబ్రవరి 19న ప్రకాశంజిల్లా నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య బస్సు యాత్రను ప్రారంభిస్తున్న నేపథ్యంలో టిడిపికి నేతలకు నోటీసులు జారీ చేయడం రాజకీయ రచ్చకు తెరలేపినట్లయ్యింది.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్‌ క్వారీల్లో అక్రమాల నివారణ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను అడ్డుకునే లక్ష్యంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించింది. ఆరునెలలపాటు వివిధ ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి పక్కా ఆధారాలతో నివేదిక అందించారు. అందిన నివేదికల ఆధారంగా క్వారీ యజమానులకు ప్రభుత్వం పెద్దమొత్తంలో జరిమానాలు విధిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రకాశంజిల్లాలోని గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో టిడిపికి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు క్వారీలకు భారీ జరిమానా విధించడం, అధికారపక్షానికి చెందిన ఒకరిద్దరు నేతల క్వారీలకు ఎలాంటి నోటీసులు జారీ కాకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అలాగేబల్లికురవ మండలం గురిజేపల్లి వద్ద బ్లాక్‌ గ్రానైట్‌ నిక్షేపాలు వెలికి తీసే క్వారీలకు రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్‌ పేరుతో నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల జారీపై మైనింగ్ అధికారులు పెదవి విప్పడం లేదు.

అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు…22 క్వారీలకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎస్‌.ఆర్‌. కన్‌స్ట్రక్చన్స్‌కు 286 కోట్ల జరిమానా విధించారు. దీని యజమానిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు గరిక పాటి మోహనరావుకు నోటీసులు అందినట్లు తెలిసింది. గతంలో టీడీపీలో ఉన్న ఈయన కొద్దికాలం క్రితం బీజేపీలో చేరారు. అలాగే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ క్వారీలకు సంబంధించిన నోటీసులు జిల్లా అధికారులకు అందినట్లు తెలిసింది.

గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీచేసిన ప్రభుత్వం, తాజాగా బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తున్న వారికి భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు. తాజా సమాచారం మేరకు బల్లికురవలో క్వారీ నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ గరికపాటి మోహనరావుకు 286 కోట్ల జరిమానా విధించగా, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ క్వారీలకు 303 కోట్ల జరిమానా విధించారు. అధికారపార్టీకి చెందిన మారం వెంకారెడ్డి క్వారీకి మాత్రం 70కోట్లు మాత్రమే విధించినట్లు తెలిసింది.

Also read: Pawan Kalyan super comment on YCP-BJP friendship

అదేరకమైన పరిస్థితి చీమకుర్తి ప్రాంతంలోని గెలాక్సీ గ్రానైట్‌లోనూ కన్పించింది. టిడిపికి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన బంధువర్గం, ఆయనతో కలిసి పనిచేస్తున్న వారు నిర్వహిస్తున్న 33 క్వారీలకు భారీ జరిమానాలు విధించినట్లు తెలిసింది. ఏది ఏమైనా మొత్తం 55కు పైగా క్వారీలకు జరిమానా విధిస్తూ నోటీ సులు జారీ కావడంతో గ్రానైట్‌ వ్యాపారులేకాక, అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ఇంకో వైపు అనుబంధ పరిశ్రమలపై ఆధారపడిన వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్‌ క్వా రీ యజమానుల సంఘం నాయకుల్లో అందుబాటులో ఉన్నవారంతా ఈ విషయంపై చర్చించుకున్నట్లు తెలిసింది. ఒకట్రెండ్రోజుల్లో అసోసియేషన్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

ఒక క్వారీలో ఒకవేళ ఏదైనా లోపం గుర్తించినా 20 వేలు, మహా అయితే లక్షకు మించి జరిమానాలు ఉండవు. అలాంటిది సరాసరిన సంవత్సరానికి వ్యాపారం చేసే మొత్తానికన్నా ఈ జరిమానాలే అనేక రెట్లు ఎక్కువగా ఉండటం గ్రానైట్‌ వ్యాపారాలను బెంబేలెత్తిస్తోంది. దీంతో అధికారులు పిలుస్తున్నా.. జరిమానా నోటీసులు తీసుకోవడానికి వారంతా జంకుతున్నారు. ఈ నేపధ్యంలో టిడిపి నేతల్ని టార్గెట్ చేసుకుని ఈ భారీ జరిమానాలు విధిస్తున్నారని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.