Pawan Kalyan New Plan: అమరావతి కోసం పవన్ కల్యాణ్ కొత్త సంకల్పం.. త్వరలోనే ప్రకటన

అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ప్రభుత్వాన్ని మెప్పించేందుకు త్వరలో బ్రహ్మస్త్రాన్ని సంధిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan New Plan: అమరావతి కోసం పవన్ కల్యాణ్ కొత్త సంకల్పం.. త్వరలోనే ప్రకటన
Follow us

|

Updated on: Feb 15, 2020 | 3:26 PM

Pawan Kalyan to announce new action plan for Amaravati Capital: అమరావతి రాజధానిని పరిరక్షించుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సంకల్పాన్ని ప్రకటించారు. త్వరలోనే దాన్ని తేదీతో సహా వెల్లడిస్తానని ఆయన చెప్పారు. రాజధాని ఏరియా రైతుల కోరిక మేరకు అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. రాజధాని పరిరక్షణ కోసం త్వరలో బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తానని వెల్లడించారు.

భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనసేన శ్రేణులతో కలిసి పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాయపూడిలో రైతులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వంలో వున్న వారు మారినప్పటికీ.. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.. అని ఆయనన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనడానికి బిజెపి సానుకూలంగా ఉందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. రాజధాని అనేది రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశమని, ప్రస్తుతం విశాఖపట్నంలో భూసమీకరణని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.

Also read: Pawan Kalyan comments on BJP, YCP alliance

అమరావతి ప్రాంతంలో మంచి పంటలు పండే భూములను రైతులు వైసీపీ నాయకుల నవరత్నాల కోసం త్యాగం చేయలేదని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా అన్నారు. అన్ని కులాలు, మతాల వాళ్లు రాజధాని కోసం భూములను త్యాగం చేశారని, టీడీపీ నాయకుల మీద కోపం ఉంటే వారితో తేల్చుకోవాలని, ఆ కోపం రాజధాని ఏరియా రైతులపై చూపించడం తగదని పవన్ కల్యాణ్ కామెంట్ చేశారు. ఒక్క కలం పోటుతో రాజధాని తరలించడం సాధ్యం కాదని, తెలంగాణ నుండి వచ్చినపుడు అక్కడ భూములు అమ్ముకుని ఇక్కడ కొన్న వారు తీవ్రంగా నష్టపోయారని ఆయన అంటున్నారు.

రాజధాని తరలి పోతుందన్న ఆవేదనతో 41 మంది ప్రాణాలు కోల్పోయారని..ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు త్వరలోనే లాంగ్ మార్చ్ నిర్వహిస్తానని, త్వరలోనే తేదీతో సహా ప్రకటించి.. లాంగ్ మార్చ్‌తో రాజధాని తరలింపును అడ్డుకుంటానని పవన్ కల్యాణ్ సరికొత్త సంకల్పాన్ని ప్రకటించారు.