ప్రజల కోసం ఓటు వేశా.. ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా శనివారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొదటిసారి ఆయన ఓటర్ అయ్యారు. గత ఏడాదితో 18 ఏళ్ళు నిండిన రైహాన్.. తన పేరెంట్స్ తో సహా ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం తనకు మంచి ఫీలింగ్ ఇచ్చిందని, పరీక్షల కారణంగా గత ఎన్నికల్లో ఓటు వేయలేకపోయానని ఆయన చెప్పాడు. ఓటుహక్కును అందరూ వినియోగించుకోవాలని కోరిన రైహాన్..తన జీవితమంతా ఈ ఢిల్లీలోనే గడిచిందని, […]
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా శనివారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొదటిసారి ఆయన ఓటర్ అయ్యారు. గత ఏడాదితో 18 ఏళ్ళు నిండిన రైహాన్.. తన పేరెంట్స్ తో సహా ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం తనకు మంచి ఫీలింగ్ ఇచ్చిందని, పరీక్షల కారణంగా గత ఎన్నికల్లో ఓటు వేయలేకపోయానని ఆయన చెప్పాడు. ఓటుహక్కును అందరూ వినియోగించుకోవాలని కోరిన రైహాన్..తన జీవితమంతా ఈ ఢిల్లీలోనే గడిచిందని, ఈ నగరం మరింత అభివృధ్ది చెందాలని ఆకాంక్షిస్తున్నానని, ప్రపంచంలోనే బెస్ట్ సిటీ కావాలని పేర్కొన్నాడు. ప్రజలకోసమే నేను ఓటు వేశా అని చెప్పాడు. ఇంకా ఏమైనా చెప్పదలచుకున్నారా అని మీడియా గుచ్చి ..గుచ్చి ప్రశ్నించగా.. ప్రతివారూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, తనలాంటి విద్యార్థులకు ‘కన్సెషన్’ ఇవ్వాలని కోరాడు. అటు- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పులకిత్ కూడా ఈ ఎన్నికల్లో మొదటిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీ తండ్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన.. ప్రజలు ఎన్నుకున్నవాళ్ళే సీఎం అవుతారు అని చాకచక్యంగా సమాధానమిచ్చాడు.