Priyanka Gandhi: ఆ చిన్నారి మాటలకు ప్రియాంక ‘ఫిదా’ …ఇంతకీ ఆ చిన్నారి ఏమందంటే..
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. అక్కడి ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను పంచుకుంటూ ఉంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది ప్రియాంక. ఇందులో మహిళల పోరాటం గురించి ఒక చిన్నారి ఎంతో ధైర్యంగా మాట్లాడింది . ‘నేను ఓ బాలికను. అయితే నా హక్కుల కోసం ధైర్యంగా పోరాడతాను. అదేవిధంగా పోరాడే ప్రతి బాలిక, మహిళ పక్కన ధైర్యంగా నిలబడతాను’ అని ఆ చిన్నారి చెప్పిన మాటలకు వేలాదిమంది నెటిజన్లు ఫిదా అయ్యారు. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోపే తనను మెచ్చుకుంటూ లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు. ప్రియాంక కూడా ఆ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ తన వీడియోకు ‘నా చిన్నారి స్నేహితురాలు అందించిన సందేశం’, అనే క్యాప్షన్, # వుమెన్ పవర్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
View this post on Instagram
Also Read: