ఇండియా గేట్ వద్ద ప్రియాంక మౌన దీక్ష

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం ఇండియా గేట్ వద్ద రెండు గంటలపాటు మౌన దీక్ష పాటించారు. పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించిన విషయం తెలిసిందే..యూనివర్సిటీ లైబ్రరీలో, బాత్ రూమ్ లో దాక్కున్న స్టూడెంట్స్ ను కూడా వారు వదలలేదు. ఆ ఘర్షణల్లో అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు కూడా.. పోలీసుల చర్యను నిరసిస్తూ.. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా […]

ఇండియా గేట్ వద్ద ప్రియాంక మౌన దీక్ష
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 16, 2019 | 6:19 PM

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం ఇండియా గేట్ వద్ద రెండు గంటలపాటు మౌన దీక్ష పాటించారు. పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించిన విషయం తెలిసిందే..యూనివర్సిటీ లైబ్రరీలో, బాత్ రూమ్ లో దాక్కున్న స్టూడెంట్స్ ను కూడా వారు వదలలేదు. ఆ ఘర్షణల్లో అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు కూడా.. పోలీసుల చర్యను నిరసిస్తూ.. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ.. సుమారు 300 మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వెంట ఉండగా మౌన నిరసనకు దిగారు. అయితే ఈ స్థలానికి విద్యార్థులు చేరకుండా పోలీసులు వలయంలా ఏర్పడ్డారు. దగ్గరలోని మెట్రో స్టేషన్లను, షాపులను మూసివేయించారు. ఆదివారం జరిగిన జామియా ఘటనపై జుడిషియల్ విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పాలక బీజేపీ నేతల ఆదేశాలపై పోలీసులు విద్యార్థులమీద అమానుష చర్యకు పాల్పడ్డారని ఈ పార్టీ ఆరోపిస్తోంది. ఖాకీల తీరుపై మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి మెమోరాండం సమర్పించాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. .