AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నావ్ రేప్ కేసు.. కుల్ దీప్ సెంగార్ కు యావజ్జీవ శిక్ష ?

యూపీలోని ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ ని ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టు దోషిగా ప్రకటించింది. 2017 లో నాడు మైనర్ గా ఉన్న బాలికను ఇతగాడు కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడన్నది ప్రధాన ఆరోపణ. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 120 బీ, 363, 366, 376 సెక్షన్ల కింద, మైనర్ బాలికలపై లైంగిక నేరాల అదుపునకు సంబంధించిన ‘ పోక్సో ‘ చట్టంలోని సంబంధిత […]

ఉన్నావ్ రేప్ కేసు.. కుల్ దీప్ సెంగార్ కు యావజ్జీవ శిక్ష ?
Pardhasaradhi Peri
|

Updated on: Dec 16, 2019 | 5:52 PM

Share

యూపీలోని ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ ని ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టు దోషిగా ప్రకటించింది. 2017 లో నాడు మైనర్ గా ఉన్న బాలికను ఇతగాడు కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడన్నది ప్రధాన ఆరోపణ. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 120 బీ, 363, 366, 376 సెక్షన్ల కింద, మైనర్ బాలికలపై లైంగిక నేరాల అదుపునకు సంబంధించిన ‘ పోక్సో ‘ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఇతడ్ని దోషిగా జడ్జి ధర్మేష్ శర్మ ప్రకటించారు.

యూపీలోని బంగేర్మవు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సెంగార్ ని కమలం పార్టీ గత ఆగస్టులో బహిష్కరించింది. అయితే ఈ కేసులో ఇతని సహ నిందితుడు శశిసింగ్ ని కోర్టు అన్ని అభియోగాలనుంచి నిర్దోషిగా విడిచిపుచ్చింది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చాలా జాప్యం చేసిందని కోర్టు విమర్శించింది. ఇన్వెస్టిగేషన్ లో ఈ సంస్థ.. ప్రాసిక్యూషన్ కు సంబంధించి మాన్యువల్ పాటించలేదని తప్పు పట్టింది. ఈ నేరం తాలూకు సమాచారాన్ని చాలా ఆలస్యంగా పోలీసులకు తెలిపారన్న డిఫెన్స్ వాదనను తోసిపుచ్చింది. పైగా బాధితురాలి బంధువు కావాలనే ఆలస్యంగా ఫిర్యాదు చేశారన్న వాదనను సైతం న్యాయమూర్తి తిరస్కరించారు. తనకు, తన కుటుంబానికి సెంగార్ నుంచి హాని ఉందని భయపడిన బాధితురాలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నోలోని ఓ సెషన్స్ కోర్టు నుంచి ఢిల్లీ తిస్ హజారీ కోర్టుకు బదిలీ అయిన ఈ కేసును న్యాయమూర్తి రోజువారీ ప్రాతిపదికపై విచారించారు. ‘ఈ కేసులో దోషికి ఎంతకాలం, ఏమేరకు శిక్ష విధించాలన్న అంశంపై మంగళవారం లేదా బుధవారం కోర్టు వాదనలను ఆలకించవచ్ఛు.

గరిష్టంగా సెంగార్ కు యావజ్జీవ శిక్ష విధించవచ్చునని భావిస్తున్నారు.

2017 లో నాడు 16 ఏళ్ళ మైనర్ అయిన బాధితురాలిని సెంగార్ కిడ్నాప్ చేసి, రేప్ చేశాడని, ఇది నిరూపితమైందని కోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ కోర్టులో రహస్యంగా జరగడం విశేషం. బార్ అండ్ బెంచ్ కథనం ప్రకారం.. సెంగార్ ను దోషిగా ప్రకటించిన న్యాయస్థానం.. నేరం జరిగిన స్థలం వద్ద తాను లేనన్న అతని వాదనను తోసిపుచ్చింది. తీర్పును చదివిన జడ్జి ధర్మేష్ శర్మ.. బాధితురాలి స్టేట్ మెంట్ నిజమేనని, ఆమెపై అత్యాచారం జరిగిందని నమ్ముతున్నానని అన్నారు. తనకు, తన కుటుంబానికి హాని జరుగుతుందని బాధితురాలు భయపడిందని ఆయన పేర్కొన్నారు. ఈమె ఓ గ్రామీణ బాలిక.. కాస్మోపాలిటన్ ప్రాంతానికి చెందినది కాదు.. పైగా పెద్ద చదువుకున్నది కూడా కాదు.. అయితే.. సెంగార్ పలుకుబడి గల వ్యక్తి.. పవర్ ఫుల్ పర్సన్.. అందుకే ఆమె భయపడి అతనిపై ఫిర్యాదు చేయడానికి ఎంతోకాలం తీసుకుంది. అని ఆయన వ్యాఖ్యానించారు. బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు లేఖ రాశాక.. ఆమె కుటుంబంపై ఎన్నో క్రిమినల్ కేసులు దాఖలయ్యాయని, వాటిలో దోషి వేలిముద్రలు కనిపించాయని కోర్టు తెలిపింది. జులై 28 న బాధితురాలు కారులో ప్రయాణిస్తుండగా ఆ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆమె కుటుంబంలోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. సెంగారే ఈ ప్రమాదం చేయించాడని అనుమానిస్తున్నామని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. బాధితురాలి తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో ఇరికించి గత ఏడాది ఏప్రిల్ మూడో తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అయితే జ్యూడిషియల్ కస్టడీలో ఉండగా ఏప్రిల్ 9 న ఆయన మరణించాడు. ఇలా దేశ వ్యాప్త సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సెంగార్ కు కోర్టు యావజ్జీవ ఖైదు విధించవచ్చునని అంటున్నారు.

Follow Us