మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా
Maruti Suzuki's Big Plan.. భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసించే దిగ్గజ సంస్థ తాజాగా మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో మార్కెట్‌ను షేక్ చేయడానికి ఏకంగా నాలుగు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. అటు ఎస్‌యూవీలు, ఇటు ఎమ్‌పీవీ విభాగాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ఆ రహస్య వాహనాలు ఏంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించేందుకు మారుతి సుజుకి భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే కాలంలో రెండు ఎస్‌యూవీలు, రెండు ఎమ్‌పీవీలను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సామాన్యుల నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరినీ ఆకట్టుకునేలా వస్తున్న ఆ కొత్త కార్ల వివరాలు తెలుసుకుందాం.
భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతి సుజుకి కొత్త మోడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే రెండేళ్లలో రెండు ఎస్‌యూవీలు, రెండు ఎమ్‌పీవీలు కలిపి మొత్తం నాలుగు కొత్త యుటిలిటీ వెహికల్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లతో పాటు ఈ కొత్త వాహనాల ద్వారా తన వాటాను భారీగా పెంచుకోవాలని భావిస్తోంది.
Y43 మైక్రో SUV, Y17 7-సీటర్ ఎస్‌యూవీ
Y43 కోడ్‌నేమ్‌తో వస్తున్న మైక్రో ఎస్‌యూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ఫ్రాంక్స్ కంటే కింది స్థానంలో ఉండి, ఇగ్నిస్‌కు ప్రత్యామ్నాయంగా రానుంది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ లాంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ పటిష్టమైన డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పెట్రోల్‌తో పాటు మైల్డ్ హైబ్రిడ్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది. మరోవైపు గ్రాండ్ విటారా ఆధారంగా Y17 కోడ్‌నేమ్‌తో 7 సీట్ల ఎస్‌యూవీని కూడా మారుతి సిద్ధం చేస్తోంది. పొడవైన వీల్‌బేస్, మూడో వరుస సీట్లతో ఇది పెద్ద కుటుంబాలకు చక్కగా సరిపోతుంది.
YMC ఎలక్ట్రిక్ MPV,YDB చిన్న MPV
ఇక YMC కోడ్‌నేమ్‌తో కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని కూడా మారుతి అభివృద్ధి చేస్తోంది. కియా కేరెన్స్ క్లావిస్ ఈవీకి పోటీగా రానున్న ఈ మోడల్‌ను 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇ-విటారా నుంచి బ్యాటరీ, మోటార్ సాంకేతికతను తీసుకుంటున్న ఇందులో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది. చివరిగా YDB కోడ్‌నేమ్‌తో మరో చిన్న ఎమ్‌పీవీపై కూడా కంపెనీ పనిచేస్తోంది. జపాన్‌కు చెందిన సుజుకి స్పేసియా ఆధారంగా రూపొందే ఈ మోడల్ భారతీయ అవసరాలకు తగ్గట్టుగా రానుంది. 2027-28 నాటికి మార్కెట్లోకి రానున్న ఈ మూడు వరుసల సీట్ల ఎమ్‌పీవీని నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించనున్నారు.
