Modi with Putin: వారం రోజు పర్యటన తర్వాత రష్యా అధ్యక్షులు పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ

భారతదేశం - రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 27) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు.

Modi with Putin: వారం రోజు పర్యటన తర్వాత రష్యా అధ్యక్షులు పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
Modi With Putin (file)
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 27, 2024 | 4:11 PM

భారతదేశం – రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 27) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా, రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

“విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించాం. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. ఇటీవలి ఉక్రెయిన్ సందర్శన ద్వారా పొందిన విషయాలను ఇరు దేశాల మధ్య పంచుకున్నాం” అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ సంఘర్షణకు శాశ్వత, శాంతియుత పరిష్కారం అవసరం.” అన్ని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పర్యటన తర్వాత అక్కడి, పరిస్థితులు, శాంతి నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన విధానాలపై పుతిన్‌తో ప్రధాని మోదీ విస్తృతంగా చర్చించారు. వీరి మధ్య ఫోన్‌లో సుదీర్ఘ సంభాషణ జరిగినట్టు సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి ఉక్రెయిన్ పర్యటించారు. గత వారం పోలాండ్, ఉక్రెయిన్‌ సందర్శించారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను సందర్శించి, అక్కడ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిసిన నాలుగు రోజుల తర్వాత ఇద్దరు నేతల మధ్య తాజా చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ నాయకుడితో చర్చల సందర్భంగా, దౌత్యం ద్వారా యుద్ధాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో తన భేటీలో, భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

“భారతదేశం తటస్థంగా లేము, మొదటి నుండి శాంతి పక్షం వహించాం. శాంతి వైపు ఎంచుకున్నాం. యుద్ధానికి చోటు లేని బుద్ధుడి దేశం నుండి వచ్చాం” అని ప్రధాని అన్నారు. “రాజ్యాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడానికి భారతదేశం కట్టుబడి ఉందని, ఇది చాలా ముఖ్యమైనదని, మొత్తం ప్రపంచ సమాజానికి హామీ ఇస్తున్నాను” అని ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని అన్నారు.

గత నెలలో మోదీ మాస్కోను సందర్శించి పుతిన్‌ను కలిశారు. ఇందులో ఉక్రెయిన్ వివాదంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్య మార్గానికి తిరిగి రావాలని రష్యా అధ్యక్షుడిని మోదీ ప్రోత్సహించారు. “యుద్ధభూమిలో ఎటువంటి పరిష్కారం దొరకదని” నొక్కి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..