Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi 3.0: పాలన షురూ..! అమిత్ షా, నడ్డా, అశ్విన్ వైష్ణవ్.. బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు

నరేంద్ర మోదీ కేబినెట్‌లో శాఖల కేటాయింపు అనంతరం మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మంగళవారం (జూన్ 11) పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అమిత్ షా రెండోసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు

Modi 3.0: పాలన షురూ..! అమిత్ షా, నడ్డా, అశ్విన్ వైష్ణవ్.. బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు
Amit Shah Jaishankar Ashwini Vaishnaw
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 11, 2024 | 3:21 PM

నరేంద్ర మోదీ కేబినెట్‌లో శాఖల కేటాయింపు అనంతరం మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మంగళవారం (జూన్ 11) పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అమిత్ షా రెండోసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు అమిత్ షా నేషనల్ పోలీస్ మెమోరియల్‌కు చేరుకుని అమరులైన పోలీసులకు నివాళులర్పించారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు మోదీ తొలి కేబినెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నడ్డా ఉన్నారు. ఇక ఎస్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మొదటి ఫైల్‌పై ఆయన సంతకం చేశారు.

జౌళి శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్, ఇంధన శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించారు. చిరాగ్ తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కేరళకు చెందిన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా అశ్వనీ వైష్ణవ్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై ఉందని అన్నారు. మొదటి కేబినెట్‌ సమావేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం పేదల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనం అన్నారు. దేశ ప్రజలకు తమ ప్రభుత్వం నిరంతరం సేవ చేస్తూనే ఉంటుందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…