కేతిక ఆశలన్నీ శ్రీవిష్ణు సినిమా పైనే.. ఇప్పటికైనా సక్సెస్ అందుకుంటుందా..?
06 March 2025
Rajeev
హాట్ బ్యూటీ కేతిక శర్మ.. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కేతిక క్రేజ్ తెచ్చుకుంది.
ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో చేసింది.
ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతి కెరీర్ కాస్త స్లో అయ్యింది.
ఇటీవలే నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది ఈ అమ్మడు.
అలాగే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా పైనే కేతిక బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.
ఈ సినిమా హిట్ అయితే ఈ హాట్ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కడతాయేమో చూడాలి. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ భామ.