బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌లే బెటరా..?

Prudvi Battula 

21 February 2025

మూడేళ్ళ కింద మహేష్ బాబు పుట్టిన రోజుకు అప్‌డేట్స్ లేవని.. పోకిరి రీ రిలీజ్ చేసారు. దాని రెస్పాన్స్ చూసి గత మూడేళ్లలో దాదాపు 40 సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

తమిళంలోనూ గిల్లీతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. తాజాగా బాలీవుడ్ వంతు. అక్కడ పాత సినిమాలకు దుమ్ము దులుపుతూనే ఉన్నారు మేకర్స్.

2024లో బాలీవుడ్‌కు రీ రిలీజ్‌లతో 65 కోట్లు వచ్చాయి. అందులో తుంబాడ్ 35 కోట్లతో టాప్‌లో ఉంది.  వచ్చింది 15 కోట్లే. రీ రిలీజ్‌లో ఇండియన్ హైయ్యస్ట్ గ్రాసర్ కూడా ఇదే.

త్రిప్తి దిమ్రి లైలా మజ్నుకు రీ రిలీజ్‌లోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.  2018లో విడుదలైనపుడు కనీసం 2 కోట్లు కూడా రాలేదు. కానీ 2024లో 14 కోట్లు వచ్చాయి.

అలాగే రణ్‌బీర్ కపూర్ రాక్ స్టార్ రీ రిలీజ్‌లో 6 కోట్లు వసూలు చేయగా.. ఏ జవానీ హై దివానీ 3 కోట్లు, కల్ హో నా హో 5.80 కోట్లు వసూలు చేసాయి.

వీర్ జారా 3.15 కోట్లు రాగా.. రెహనా హై తేరే దిల్ మే సినిమాకు రీ రిలీజ్‌లో 4 కోట్లు వచ్చాయి. రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసాక.. అస్సలు ఆగట్లేదు నిర్మాతలు.

తాజాగా సనమ్ తేరీ కసమ్ అనే సినిమా అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తుంది. 2016లో విడుదలైనపుడు ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కనీసం 8 కోట్లు కూడా రాలేదు.

ఫిబ్రవరి 7న రీ రిలీజ్ చేస్తే వాలైంటైన్స్ డే ఉంది కాబట్టి 37.72 కోట్లు వసూళ్లు చేసి తుంబాడ్‎ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‎లో నిలిచింది.