ఒకప్పుడు దర్శకుడు శంకర్‌తో మూవీ అంటే ఎగ్జైట్ అయ్యేవాళ్లు హీరోలు.. ఎగిరి గంతేసేవాళ్లు నిర్మాతలు.. మాకెప్పుడు ఆ ఛాన్స్ వస్తుందా అని వేచి చూసేవాళ్లు నటులు.
వరసగా ఫ్లాపులు వస్తున్న ఈ సమయంలో శంకర్ నెక్ట్స్ సినిమా ఏంటి అని అడుగుతున్నారంతా. ఇండియన్ 3 లైన్‌లో ఉండగా నెక్ట్స్ సినిమా గురించి ఎందుకు.. అనుకుంటున్నారు కదా..!
కానీ ప్లానింగ్‌లో పిహెచ్‌డీ చేసిన శంకర్ ఊరుకుంటారా చెప్పండి..? అందుకే అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌పై వర్క్ మొదలుపెట్టేసారు.
2010లో వచ్చిన రోబో తర్వాత ఆ రేంజ్ సక్సెస్ శంకర్‌కు రాలేదు. ఐ, 2.0, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ కమర్షియల్‌గా నిరాశ పరిచాయి.
ఆ మధ్య ఎక్కువగా విఎఫ్ఎక్స్ సినిమాలు చేసినా శంకర్.. చాలా ఏళ్ళ తర్వాత రెండు పొలిటికల్ సినిమాలు చేసాడు. అవే ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. ఈ రెండూ నిరాశ పరిచాయి.
ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో.. పార్ట్ 3పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. దీని తర్వాత ప్రాజెక్ట్‌కు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శంకర్.
వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని శంకర్ కూడా కన్ఫర్మ్ చేసారు.
మధురై ఎంపి వెంకటేశన్ రాసిన నవలలో వేల్పరి నేపథ్యం సినిమాలో వాడుకోబోతున్నారు శంకర్. శంకర్‌ను నమ్మి వందల కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాతలెవరా అని ఆలోచించాల్సిందే.