సైడ్ సైడ్ ప్లీజ్.. అప్‌కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!

Prudvi Battula 

21 February 2025

ఇండస్ట్రీలో ఉనికి కోసం కొందరు ముద్దుగుమ్మలు వేచి చేస్తున్నారు. అందులో అదితి శంకర్ గురించి ముందు చెప్పుకోవాలి.

భైరవంలో బెల్లంకొండకు జోడీగా నటిస్తున్నారీమే. తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితి.. టాలీవుడ్‌లోనూ ఇదే చేయాలని చూస్తున్నారు.

నటిగా అదితి శంకర్‌కు భైరవం మొదటి సినిమా గానీ.. సింగర్‌గా మాత్రం ఇప్పటికే పరిచయం. వరుణ్ తేజ్ గనిలో రొమియో జూలియట్ అంటూ పాడేసారు అదితి.

ఇక రుక్సర్ థిల్లన్ సైతం గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. దిల్ రుబా అంటూ వచ్చేస్తున్నారీమే. క తర్వాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా కావడంతో దినిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు లేని రుక్సర్ కెరీర్‌కు దిల్ రుబా కీలకం కానుంది. ఈ సినిమా టీజర్‌కి రెస్పాన్స్ బాగానే ఉంది.

త్వరలోనే సినిమా విడుదల కానుంది. కచ్చితంగా తన కెరీర్‌ను మార్చే సినిమా దిల్ రుబా అవుతుందని నమ్ముతున్నారు రుక్సర్.

టాలీవుడ్‌లో ఉనికి చాటుకోవాలని చూస్తున్న మరో హీరోయిన్ రితికా నాయక్. ఈ పేరెక్కడా విన్నట్లు లేదు కదా..!

ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం, నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్నలో నటించారు రితిక.

ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్‌తో పాటు ఆనంద్ దేవరకొండతో డ్యూయట్‌లో నటిస్తున్నారు. మొత్తానికి వీళ్లంతా కెరీర్‌ను మార్చే ఒక్క సినిమా కోసం వేచి చూస్తున్నారు.