సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి, మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
సజ్జలు తినడం వల్ల డయాబెటిస్ కూడా రాకుండా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారు సజ్జలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి షుగర్ కంట్రోల్ అయ్యేలా చేస్తాయి.
వేరే ఆహారాలతో పోలిస్తే సజ్జలు కాస్త నిదానంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇవి రక్తంలోకి గ్లూకోజ్ ను మెల్లగా విడుదల చేస్తాయి. మధుమేహం బాధితులకు మంచి ఆహారం.
సజ్జల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతగానో దోహదం చేసి శరీరం మెటబాలిజం బాగా జరిగేలా చేస్తాయి. సజ్జలను తింటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఊబకాయంతో బాధపడుతున్న వారికి సజ్జలు మంచి ఆహారం. సజ్జల్లో ఫినాలిక్ లు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలలో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పని చేస్తాయి.
సజ్జలను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మం మీద ముఖం మీద ముడతలు తొలగిపోయి ఆరోగ్యంగా కనిపిస్తారు.
ఇక సజ్జలలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో రక్తహీనతను తగ్గిస్తాయి. సజ్జలు మన జీవక్రియను మెరుగుపరుస్తాయి.
కొలెస్ట్రాల్ ను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి అద్భుతమైన శక్తి వనరుగా పనిచేస్తాయి. బరువును తగ్గించటంలో కీలకంగా పనిచేస్తాయి.