ఇకపై యూపీఐ ద్వారా విత్‌ డ్రా.. ఈపిఎఫ్ఓ కొత్త విధానం.. 

TV9 Telugu

06 March 2025

ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

ప్రస్తుతం మీ పీఎఫ్‌ నగదును విత్‌డ్రా చేయాలంటే వెబ్సైట్ లో అప్లై చేసిన కొన్ని రోజుల సమయం పడుతోంది. చాలసార్లు తిరస్కరణ కూడా జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే ఈపిఎఫ్ఓ నగదు విత్‌డ్రాను సులభతరం చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం సన్నాహాలు చేస్తుంది.

ఇందులో భాగంగానే జూన్‌ నాటికి ఏటీఎం ద్వారా పిఎఫ్ నగదు విత్ డ్రా చేసుకొనే అవకాశం కల్పించబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.

మరోవైపు యూపీఐ ద్వారా కూడా పీఎఫ్‌ విత్ డ్రా చేసుకొనేలా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌తో (NPCI) ఈపీఎఫ్‌ఓ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ ఏడాది మే, జూన్‌ నాటికి ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి పేమెంట్ల యాప్స్‌ ద్వారా పిఎఫ్ విత్ డ్రా చేసుకొనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనికి పరిమితి ఉంటుందా? ఎంత నగదు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.

పిఎఫ్ విత్ డ్రా సులభతరం కావడం వల్ల అత్యవసర సమయాల్లో చాలామంది సహాయపడినప్పటికీ పీఎఫ్‌ ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.