06 March 2025
Pic credit-Pexel
TV9 Telugu
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పానీయాలలో టీ ఒకటి. ధనవంతుల నుంచి సామాన్యుల వరకూ చాలా మంది తమ రోజును టీతో ప్రారంభిస్తారు.
టీలో ఎన్నో రకాలున్నాయి. అయితే కొంతమంది పాల టీలో ఉప్పు కలిపి కూడా తాగుతారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సాల్ట్ టీ గురించి నిపుణుల సలహా ఏమిటంటే
ఒక కప్పు టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ అంటున్నారు.
ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది టీ తాగడం వలన గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది
ఉప్పులో ఉండే ఖనిజాలు ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని ప్రశాంతపరచడంలో పాటు మానసిక అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
జలుబు దగ్గులో బాధపడుతుంటే ఉప్పు కలిపిన టీ తాగడం వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఉప్పు సహాయపడుతుంది
ఒక కప్పు మిల్క్ టీకి దాదాపు 1/8 టీస్పూన్ ఉప్పు సరిపోతుంది. ఎక్కువ ఉప్పు కలపడం వల్ల టీ రుచి చెడిపోతుంది.
తరచుగా అనారోగ్యంతో బాధపడేవారు రోజుకు కనీసం రెండు కప్పుల సాల్ట్ టీ తాగాలని పోషకాహార నిపుణురాలు అంటున్నారు