AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సంస్కరణలు ప్రారంభంలో ఎవరికి నచ్చవు.. అగ్నిపథ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

అగ్నిపథ్‌ పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు తాత్కాలికంగా విమర్శలు వస్తాయని. తరువాత ఆ సంస్కరణలే దేశాభివృద్దికి దోహదం చేస్తామన్నారు. కర్నాటకలో రెండురోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు.

PM Modi: సంస్కరణలు ప్రారంభంలో ఎవరికి నచ్చవు.. అగ్నిపథ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Jun 20, 2022 | 7:20 PM

Share

ప్రధాని మోదీ(PM Modi) కర్నాటక పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మోదీ. బెంగళూర్‌, మైసూర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని. దేశంలో హాట్‌టాపిక్‌గా మారిన అగ్నిపథ్‌ పాలసీపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. సంస్కరణలు తొలుత ఎవరికి నచ్చవన్నారు . దీర్ఘకాలంలో అవే సంస్కరణలతో జాతి నిర్మాణం జరుగుతుందన్నారు. రక్షణరంగంలో యువతకు ఉపాధి అవకాశాలు గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాయని స్పష్టం చేశారు.

ఎన్నో నిర్ణయాలు , ఎన్నో సంస్కరణలు తాత్కాలికంగా ఎవరికి నచ్చవు. కాలం గడిచిన కొద్దీ అవే సంస్కరణలు దేశానికి ఎంతో ఉపయోగపడుతాయి. సంస్కరణల బాట తోనే మనం అభివృద్దిలో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది . స్పేస్‌ , డిఫెన్స్‌ రంగాలను యువత కోసం తెరిచాం. దశాబ్దాల పాటు ఈ రంగాల్లో ప్రభుత్వానిదే ఆధిపత్యం. డ్రోన్ల నుంచి విమానరంగం వరకు యువతకు ప్రోత్సాహం ఇస్తున్నాం.

ఇవి కూడా చదవండి

బెంగళూర్‌లో రూ.28 వేల కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. బెంగళూర్‌ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని ప్రశంసించారు మోదీ. ప్రభుత్వ – ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ది సాధ్యమని , దీనికి బెంగళూర్‌ నగరమే నిదర్శనమని అన్నారు . గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందన్నారు.

మైసూర్‌లో కూడా పలు అభివృద్ద కార్యక్రమాలను ప్రారంభించారు మోదీ. నాగనహళ్లి ఏసీ టర్మినల్‌ను ప్రారంభించారు. ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సంస్థలను కూడా ప్రారభించారు. ఈ కార్యక్రమానికి సీఎం బస్వరాజ్‌ బొమ్మై , మాండ్యా ఎంపీ సుమలత హాజరయ్యారు.

మంగళవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మైసూర్‌ ప్యాలెస్‌లో జరిగే వేడుకలకు మోదీ హాజరవుతారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత యోగాడేను నిర్వహిస్తున్నారు. 15 వేలమందితో కలిసి యోగా చేస్తారు మోదీ.

జాతీయ వార్తల కోసం