Watch Video: ఇస్రో మహిళా శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ .. చంద్రయాన్-3 విజయంపై ఏం మాట్లారంటే ?
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయంలో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఉంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ ఆ శాస్త్రవేత్తలను కలిసిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కార్యాలయంలో వారిని ఆయన కలిశారు. ఈ క్రమంలో చంద్రయాన్-3 ప్రాజెక్టులో మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. విక్రమ్ ల్యాండైన ప్రాంతాన్ని శివశక్తిగా ప్రధాని మోదీ నామకరణం చేశారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయంలో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఉంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ ఆ శాస్త్రవేత్తలను కలిసిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కార్యాలయంలో వారిని ఆయన కలిశారు. ఈ క్రమంలో చంద్రయాన్-3 ప్రాజెక్టులో మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. విక్రమ్ ల్యాండైన ప్రాంతాన్ని శివశక్తిగా ప్రధాని మోదీ నామకరణం చేశారు. అలాగే ఆగస్ట్ 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కూడా ప్రకటించారు. ఈ నేఫథ్యంలో మహిశా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని తమను మెచ్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మార్స్, ఆదిత్య మిషన్లు చేపట్టనున్నట్లు వారు చెబుతున్నారు.
#WATCH | “We are very happy….it was wonderful, he (PM) appreciated all our efforts…I was in the Pragyan team and for me, Pragyan is like the baby and he is taking baby steps on the Moon, it is a wonderful experience to see the rover roll out on the Moon for the first time. Our… pic.twitter.com/bOdcuOm6td
ఇవి కూడా చదవండి— ANI (@ANI) August 26, 2023
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి, అలాగే చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రాంతానికి తిరంగా పేర్లను పెట్టడం సంతోషంగా ఉందని ఇంజినీర్ పద్మావతి అన్నారు. ప్రధాని మోదీ తమ కార్యాలయానికి వచ్చి అభినందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తమలో ఎంతో స్పూర్తిని నింపారని.. తామంతా గర్వంగా ఫీలవుతున్నామని ఇస్రో మహిళా ఇంజినీర్ సరితారెడ్డి అన్నారు.
#WATCH | “We are very happy….it was wonderful, he (PM) appreciated all our efforts…I was in the Pragyan team and for me, Pragyan is like the baby and he is taking baby steps on the Moon, it is a wonderful experience to see the rover roll out on the Moon for the first time. Our… pic.twitter.com/bOdcuOm6td
— ANI (@ANI) August 26, 2023
ప్రధాని మోదీతో కలిసి మాట్లాడడం చాలా సంతోషించదగ్గ విషయమని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త అన్నారు. నారీ శక్తిని గుర్తించడం, ప్రోత్సహించడం సంతోషంగా ఉందని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త ప్రియాంకా మిశ్రా పేర్కొన్నారు.
#WATCH | Bengaluru: On PM Modi’s visit, ISRO scientist/engineer Padmavathi says, “ShivShakti is the name he (PM Modi) has given for the landing site of Chandrayaan-3 and for Chandrayaan-2, ‘Tiranga’ is the name he has given for the landing spot. It is very encouraging for us… pic.twitter.com/SO5JekOz98
— ANI (@ANI) August 26, 2023
గగన్‌యాన్ ప్రాజెక్టుకు చంద్రయాన్ సక్సెస్ పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ఇంజినీర్ ఆర్తీ సేన్ వివరించారు. మార్క్ 3 రాకెట్‌ను మరింత శక్తివంతంగా మార్చాల్సిన సమయం దగ్గరికొచ్చిందని తెలిపారు. గగన్‌యాన్‌కు కూడా ప్రతి ఒక్కరి మద్ధతు కావాలని కోరారు.
#WATCH | “We’re feeling proud, it was a nice experience for all of us…”, says Reddy Saritha, Senior ISRO Scientist on meeting PM Modi pic.twitter.com/aM89PLu2vL
— ANI (@ANI) August 26, 2023
మన కండ్ల ముందు ఓ అద్భుతాన్ని చూశామని ఇంజినీర్ నిధి పోర్వాల్ అన్నారు. ఇది చరిత్రాత్మక సందర్భమని ప్రాజెక్టు మేనేజర్ సౌజన్య పేర్కొన్నారు. మిషన్ సక్సెస్ కావడం తమకు ఎంతగానో సంతోషాన్నిచ్చిందని జూనియర్ ఇంజినీర్ నిత్యా భారతి తెలిపారు.
#WATCH | Karnataka | “It is a cherishing moment for us to interact with the PM. He especially spoke to women scientists…,” says Daffini Senior Scientist from the U R Rao Satellite Centre working for the onboard reliability & quality assurance group of the systems reliability &… pic.twitter.com/dKYzD1pF1S
— ANI (@ANI) August 26, 2023
ప్రధాని ప్రసంగం ప్రేరణాత్మకంగా ఉందని ముత్తు సెల్వి అన్నారు. శివశక్తి పేరు పెట్టడం నారీ శక్తిని ప్రోత్సహించడమే అని ఇస్రో శాస్త్రవేత్త సావిత్రి తెలిపారు.
#WATCH | Bengaluru: Senior Scientist at U R Rao Satellite Centre (URSC), Nidhi Porwal says, “It’s magic which we have seen coming true in front of our eyes. We have been working continuously and consistently for the success of this mission for a long time…A very strong team has… pic.twitter.com/t4HIcFXjr7
— ANI (@ANI) August 26, 2023