కన్న కొడుకునే హత్య చేసేందుకు సుపారీ ఇచ్చిన తండ్రి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్న తండ్రే తన కొడుకును హత్య చేయించేందుకు సుపారీ ఇవ్వడం కలకలం రేపుతోంది. హత్య జరిగిన అనంతరం 24 గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెళగావి జిల్లాలోని బైలహోంగళ పట్టణంలోని శివానంద భారతి నగర్‌కు చెందిన సంగమేష్ మారుతి తిగాడి (39) హత్యకు గురయ్యాడు. సవదత్తి తాలూకా హిరేకొప్ప గ్రామానికి చెందిన మంజునాథ్, హీరేకొప్ప గ్రామానికి చెందిన అంజప్ప అనే నిందితులను పోలీసులను అరెస్టు చేశారు.
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్న తండ్రే తన కొడుకును హత్య చేయించేందుకు సుపారీ ఇవ్వడం కలకలం రేపుతోంది. హత్య జరిగిన అనంతరం 24 గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెళగావి జిల్లాలోని బైలహోంగళ పట్టణంలో సంగమేష్ మారుతి తిగాడి (39) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సవదత్తి తాలూకా హిరేకొప్ప గ్రామానికి చెందిన మంజునాథ్, హీరేకొప్ప గ్రామానికి చెందిన అంజప్ప అనే నిందితులను పోలీసులను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే సంగమేష్ రోజూ మద్యం తాగుతూ దానికి బానియ్యాడు. ప్రతిరోజూ ఉదయం నుంచి అర్దరాత్రి వరకు మద్యం సేవించి తండ్రి, తల్లిని వేధించేస్తూ ఉండేవాడు. అలాగే ఇంట్లోని విలువైన వస్తువులు, ధాన్యం గింజలను అమ్ముతూ మద్యం తాగేవాడు. అలాగే వీటికి తోడు సంగమేష్కు కొంత మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసింది.
ఎప్పటిలాగే సంగమేష్ తాగి ఇంటికి వచ్చి తండ్రి, తల్లిని వేధించడంతో.. తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. సంగమేశంతో వ్యాపారం చేసిన స్నేహితులైన నిందితులు మంజునాథ్, అంజప్పలతో ఆ తండ్రి హత్య చేయించాలని తెలిసింది. అయితే హత్యకు గురైన సంగమేష్‌ను బైక్‌పై బైలహోంగళ, నేసరగి, వన్నూరు, మురగోడ తదితర చోట్లకి తీసుకెళ్లారు. గోకాక తాలూకాలోని అంకల్గికి మంజునాథ్ బైక్‌పై అతనితో పాటు వచ్చాడు. ఆ తర్వాత హీరేకొప్ప గ్రామానికి తిరిగి అంజప్పను తీసుకుని అంకాలగికి తిరిగి వెళ్లిపోయాడు. అంజప్ప సహకారంతో అక్కడి వైన్‌షాప్‌లో మద్యం తాగి మత్తులో ఉన్న సంఘమేష్ ను నిందితుడు మంజునాథ్.. అతని బైక్‌పై సవదత్తి తాలూకా కుటరానట్టి గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో సంఘమేష్ తల మీద బండరాళ్లతో దాడి చేసి అతన్ని హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే సమాచారం తెలుసుకున్న మురగోడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత అక్కడ హత్యకు గురైంది సంఘమేష్ అని వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ప్రాంతంలో చిక్కిన ఓ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నంబర్‌కు ఫోన్ చేసిన పోలీసులు హంతకులు మంజునాథ్, అంజప్పను అరెస్టు చేశారు. ఈ మేరకు హత్యకు గురైన సంగమేష్ ఇంటికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. హత్య జరిగిన 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించడంలో విజయం సాధించారు పోలీసులు. ఈ మేరకు మురగోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సంఘమేష్ ను హత్య చెయ్యడానికి అతని తండ్రి రెండు లక్షల రుపాయలు వరకు ఇస్తానని మంజునాథ్ తో డీల్ మాట్లాడుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..