ఇప్పటికే అల్లాడిపోతున్న దేశ ప్రజలకు మరో షాక్.. పెరగనున్న టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్ల ధరలు
దేశప్రజలు ఇప్పటికే పెట్రోధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్నారు. ఇది మాత్రమే కాదు త్వరలో చాలా వస్తువుల ధరలు పెరగబోతున్నాయి.
దేశప్రజలు ఇప్పటికే పెట్రోధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్నారు. ఇది మాత్రమే కాదు త్వరలో చాలా వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధర జనవరిలో 5-6 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ముడి పదార్థాల ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. రవాణా ఛార్జీలు 5-15 శాతం తగ్గినప్పటికి అధికధరల నియంత్రణకు ఇది పెద్దగా పనికిరావడం లేదు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు వచ్చే నెలలోగా 5-6 శాతం మేర పెరగొచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువుల ముడి పదార్థాల ధరలు 10-12 శాతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు దుస్తుల ధరలు కూడా పెరిగి ఛాన్స్ ఉంది. దుస్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఖర్చు భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని పెద్ద బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నారు. అధిక వర్షాల కారణంగా ఉత్తరాదిలో బాస్మతి బియ్యం ఉత్పత్తి తగ్గింది. దీంతో బాస్మతి బియ్యం ధరలు కూడా ఇప్పటికే పెరిగాయి.
పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై ఉంది. రవాణా ఖర్చు చాలా పెరగడంతో చాలా కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంది. ముడిపదార్థాల ధరలు తగ్గకపోతే, వినియోగదార్లకు ధరల షాక్ తగ్గకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెయింట్స్ ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. బెర్జర్ పెయింట్స్ ఉత్పత్తుల ధరలను డిసెంబరులో 5-6% మేర పెంచనుంది. ముడిపదార్థాల ధరలు పెరుగుతున్నందున, లాభాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో బెర్జర్ పెయింట్ప్ ధరలు ఐదోసారి పెరగబోతున్నాయి.
Also Read: ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు
టమాటా రేటు పెరిగింది.. పంట పండింది.. కుబేరుడైన కర్నూలు జిల్లా రైతు