Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి నోరు విప్పిన ప్రజ్వల్‌.. సంచలన వీడియో

లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ హెచ్‌డీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎట్టకేలకు మౌనం వీడారు. ఏప్రిల్‌ 27వ తేదీన జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ ఈనెల 31వ తేదీన భారత్‌కు వస్తానని, సిట్‌ విచారణ ముందు హాజరవుతానని వెల్లడించారు. తన జర్మనీ పర్యటనకు, లైంగిక వేధింపుల కేసుకు సంబంధం లేదని ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియో స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు.

Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి నోరు విప్పిన ప్రజ్వల్‌.. సంచలన వీడియో
Prajwal Revanna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 27, 2024 | 6:00 PM

లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ హెచ్‌డీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎట్టకేలకు మౌనం వీడారు. ఏప్రిల్‌ 27వ తేదీన జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ ఈనెల 31వ తేదీన భారత్‌కు వస్తానని, సిట్‌ విచారణ ముందు హాజరవుతానని వెల్లడించారు. తన జర్మనీ పర్యటనకు, లైంగిక వేధింపుల కేసుకు సంబంధం లేదని ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియో స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. తనపై ఆరోపణల వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. కేసుకు సంబంధించి వాస్తవాలు బయటపెడుతానని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ వీడియోలో తెలిపారు. హసన్ ఎంపీ కూడా తన తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు చెప్పారు.. రాజకీయ డ్రామా తనను నిరాశ, ఒంటరితనంలోకి నెట్టిందని పేర్కొన్నారు.

‘‘నాపై అసత్య ఆరోపణలు చేశారు.. దీని వెనుక భారీ కుట్ర ఉంది .. ఈనెల 31వ తేదీన భారత్‌కు వస్తున్నా.. సిట్‌ విచారణకు హాజరవుతా.. బాధ పెట్టినందుకు కార్యకర్తలకు క్షమాపణలు’’ – ప్రజ్వల్‌ రేవణ్ణ

వీడియో చూడండి..

అంతకుముందు ప్రజ్వల్‌ రేవణ్ణకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు మాజీ ప్రధాని దేవేగౌడ.. పోలీసుల ముందు వెంటనే లొంగిపోవాలని హెచ్చించారు. లేదంటే తన ఆగ్రహానికి బలి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే.. కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన దేవేగౌడ కుటుంబం ఈ కేసుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీని వెనుక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హస్తముందని కుమారస్వామి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు డీకే శివకుమార్‌..

కాగా.. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు కర్నాటకలో వైరల్‌ అయ్యాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా.. ఆయన దౌత్య పాస్ పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!