AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే.. పథకాలు కట్’ కేంద్రమంత్రి స్ట్రాంగ్ కౌంటర్..

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. కాంగ్రెస్ గ్యారంటీలంటేనే 'నో గ్యారంటీ' అని పేర్కొన్న ఆయన.. అధికారంలోకి వచ్చి ఆ పార్టీ ఇప్పటివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెరవేరుస్తామన్న హామీలను పూర్తి చేయలేదని మండిపడ్డారు.

Karnataka: 'లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే.. పథకాలు కట్' కేంద్రమంత్రి స్ట్రాంగ్ కౌంటర్..
Prahlad Joshi
Ravi Kiran
|

Updated on: Jan 31, 2024 | 3:13 PM

Share

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన బెదిరింపు వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. కాంగ్రెస్ గ్యారంటీలంటేనే ‘నో గ్యారంటీ’ అంటూ పేర్కొన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పటివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని మండిపడ్డారు. హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు బెదిరింపులకు దిగుతూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటోందన్నారు ప్రహ్లాద్ జోషి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే హామీలన్నీ రద్దు చేస్తానని ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ప్రకటించారు. అభివృద్ధి పథకాలకు కత్తెర వేసిన కాంగ్రెస్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ఇప్పుడు బెదిరింపులకు దిగుతోందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ విషయాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కచ్చితంగా బుద్ది చెబుతారని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని.. లేదంటే ప్రభుత్వం గ్యారంటీలన్నింటిని రద్దు చేస్తుందని హెచ్చరించారు. ‘ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే మేం గ్యారంటీలను కొనసాగిస్తాం, లేకుంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి వాటిని రద్దు చేస్తాం. మీకు హామీల కంటే దేవాలయాలు ఎక్కువ విలువ కలిగినవిగా భావించి.. గ్యారంటీలన్నీ ఆపేస్తాం. ఆ డబ్బుతో తాము కూడా దేవాలయాలు నిర్మిస్తాం. దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతాం, ఏమంటారు.?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ అంశంపై తాను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడినట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. ‘మీకు(ప్రజలకు) హామీలు కావాలా, బియ్యం గింజలు కావాలా.. మీరు(సీఎం) ఇచ్చిన హామీల వల్ల ప్రజలు మనల్ని గెలిపించాలని, లేదంటే ఆ హామీలను రద్దు చేసి ఈ నిధులను అభివృద్ధికి వినియోగిస్తామని సీఎంకి చెప్పాను.’ అని బాలకృష్ణ తెలిపారు.

కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్(గృహజ్యోతి), ప్రతి కుటుంబంలోని మహిళలకు(గృహలక్ష్మి) నెలవారీ రూ. 2,000 సహాయం, దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల బియ్యం ఉచిత పంపిణీతో పాటు నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం రూ. 3,000.. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రెండేళ్ల పాటు(యువనిధి) రూ. 1,500, అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో(శక్తి) మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి హామీలను అమలులోకి తీసుకొస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.