Mobile Phones: తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు.. విడిభాగాలపై దిగుమతి సుంకం భారీగా తగ్గింపు.. కేంద్ర మంత్రి కీలక ట్వీట్..
నరేంద్ర మోదీ నేతృత్ంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని గతంలో 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ భాగాలలో బ్యాటరీ ఎన్‌క్లోజర్‌లు, ప్రైమరీ లెన్స్‌లు, బ్యాక్ కవర్స్, ప్లాస్టిక్, మెటల్ కలయికతో తయారు చేసిన వివిధ మెకానికల్ భాగాలు ఉన్నాయి.

నరేంద్ర మోదీ నేతృత్ంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని గతంలో 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ భాగాలలో బ్యాటరీ ఎన్‌క్లోజర్‌లు, ప్రైమరీ లెన్స్‌లు, బ్యాక్ కవర్స్, ప్లాస్టిక్, మెటల్ కలయికతో తయారు చేసిన వివిధ మెకానికల్ భాగాలు ఉన్నాయి. తాజా తగ్గింపు మొబైల్ ఫోన్ సెక్టార్‌పై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో విస్తరణను పెంపొందించడం, పోటీతత్వాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల తయారీ వ్యయాన్ని తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా, వియత్నాం వంటి ప్రాంతీయ పోటీదారులతో సమానంగా మార్కెట్ లో భారత్ ముందంజలో ఉండే విధంగా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అయితే, మొబైల్ కు సంబంధించిన దాదాపు డజను భాగాలపై సుంకాన్ని తగ్గించాలని ఈ రంగంలోని కంపెనీలు ఎప్పటినుంచో కోరుతున్నాయి.
ప్రభుత్వం విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించి, కొన్ని వర్గాలలో వాటిని తొలగిస్తే, వచ్చే రెండేళ్లలో భారతదేశం నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు $11 బిలియన్ల నుండి $39 బిలియన్లకు మూడు రెట్లు పెరుగుతాయని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ముందుగా తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2024లో భారతీయ మొబైల్ పరిశ్రమ సుమారు $50 బిలియన్ల విలువైన మొబైల్ ఫోన్‌లను తయారు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో $55-60 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. FY24లో ఎగుమతులు దాదాపు $15 బిలియన్లకు, ఆపై FY25లో $27 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది.
అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే..
కాగా.. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 10శాతానికి తగ్గించడంపై కేంద్ర ఐటీ శాఖ అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ మేరకు కీలక ట్వీట్ చేశారు. “ఈ కస్టమ్ డ్యూటీల హేతుబద్ధీకరణ పరిశ్రమకు, కస్టమ్స్ ప్రక్రియలకు చాలా అవసరమైన నిశ్చయత, స్పష్టతను తెస్తుంది. మొబైల్ ఫోన్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ చర్య తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ అశ్విని వైష్ణవ్ ట్వీట్ లో తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే వస్తువులకు వర్తించే రెసిడ్యూరీ కేటగిరీ/ఇతర వాటిపై విధించే కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి 10%కి తగ్గించబడటం కీలక పరిణమామంటూ పేర్కొన్నారు.
Rationalization of customs duties brings much-needed certainty and clarity for the industry. Thanks to Hon’ble PM @narendramodi Ji and FM @nsitharaman Ji for strengthening the mobile phone manufacturing ecosystem through this measure. pic.twitter.com/cwP4MNksy4
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2024
ICEA ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ మాట్లాడుతూ.. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం స్వాగతించే విషయమన్నారు. భారతదేశంలో మొబైల్ తయారీని ప్రపంచంలో పోటీగా మార్చడానికి, భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కీలకపరిణామన్నారు. ఎగుమతి ఆధారిత వృద్ధి మరియు పోటీతత్వం పట్ల ప్రభుత్వ ధోరణి మరింత అవకాశాలను సృష్టిస్తుందని మొహింద్రూ వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




