Postpaid Plans: ఆ రెండు నెట్‌వర్క్స్‌లో ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆఫర్స్.. పోస్ట్‌పెయిడ్ సిమ్ తీసుకోవాల్సిందే..!
ముఖ్యంగా కుటుంబంలోని వివిధ సభ్యుల కోసం వేర్వేరు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి మీరు జియో లేదా ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ని తీసుకుంటే తక్కువ ధరకే కుటుంబం మొత్తం సేవలను ఆశ్వాదించవచ్చు. ఇది నెలవారీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరను తగ్గిస్తుంది.

మీరు జియో లేదా ఎయిర్‌టెల్ యూజర్‌గా ఉన్నారా?మీ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ఎక్కువని అనుకుంటున్నారా? ముఖ్యంగా కుటుంబంలోని వివిధ సభ్యుల కోసం వేర్వేరు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి మీరు జియో లేదా ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ని తీసుకుంటే తక్కువ ధరకే కుటుంబం మొత్తం సేవలను ఆశ్వాదించవచ్చు. ఇది నెలవారీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరను తగ్గిస్తుంది.
జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్
జియో 399 ప్లాన్ ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల వాలిడిటీతో వస్తుంది. ఇందులో మెయిన్ సిమ్‌తో పాటు 3 ఫ్యామిలీ సిమ్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఒక్కో సిమ్‌కు ప్రత్యేకంగా రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 75 జీబీ డేటా లభిస్తుంది. ప్రతి సిమ్‌పై 5 జీబీ అదనపు డేటా అందిస్తారు. ఈ ప్లాన్ కోసం సింగిల్ టైమ్ సెక్యూరిటీ మొత్తం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మీరు వాట్సాప్‌లో 70000కు మిస్డ్ కాల్ చేయడం ద్వారా జియో ప్లస్‌సేవను సక్రియం చేయవచ్చు. అప్పుడు మీరు పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను ఉచితంగా హోమ్ డెలివరీ కోసం అభ్యర్థనను సమర్పించాలి. దీని తర్వాత మీ కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు సిమ్ పొందే అవకాశం ఉంటుంది.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.599 ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం అందిస్తారు. ఈ ప్లాన్ మొత్తం 105 జీబీ డేటాతో వస్తుంది. ఇందులో ప్రైమరీ యూజర్‌కు 75 జీబీ డేటా, సెకండరీ యూజర్లకు 30 జీబీ డేటా అందిస్తారు. ఈ ప్లాన్‌లో మీరు 200 జీబీ వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను పొందుతారు. ఈ ప్లాన్ 6 నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








