AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Pro Plus 5G: రియల్‌ మీ నుంచి సరికొత్త 5జీ ఫోన్‌.. అత్యాధునిక సాంకేతికత.. అద్భుత ఫీచర్లు..

దేశంలోని స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 5జీ ఫోన్లు క్యూ కడుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ కూడా అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రియల్‌ మీ కూడా ఓ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ సిరీస్‌ని లాంచ్‌ చేసింది. రియల్‌మీ 12 ప్రో 5జీ, రియల్‌మీ ప్రో ప్లస్‌ 5జీ పేరిట కొత్త ఫోన్‌ మార్కెట్లోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Realme Pro Plus 5G: రియల్‌ మీ నుంచి సరికొత్త 5జీ ఫోన్‌.. అత్యాధునిక సాంకేతికత.. అద్భుత ఫీచర్లు..
Realme 12 Pro 5g
Madhu
|

Updated on: Jan 31, 2024 | 9:21 AM

Share

దేశంలోని స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 5జీ ఫోన్లు క్యూ కడుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ కూడా అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రియల్‌ మీ కూడా ఓ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ సిరీస్‌ని లాంచ్‌ చేసింది. రియల్‌మీ 12 ప్రో 5జీ, రియల్‌మీ ప్రో ప్లస్‌ 5జీ పేరిట కొత్త ఫోన్‌ మార్కెట్లోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రియల్‌ మీ 12 ప్రో ప్లస్‌ 5జీ..

ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ పెరిస్కోప్ టెలిఫోటో టెక్నాలజీతో వస్తుంది. క్వాల్కామ్‌ సహకారంతో అభివృద్ధి చేసిన ప్రొప్రైటరీ మాస్టర్‌షాట్ అల్గారిథంను పరిచయం చేసింది. అలాగే లగ్జరీ వాచ్-ప్రేరేపిత డిజైన్‌ను తీసుకురావడానికి అంతర్జాతీయ లగ్జరీ వాచ్ డిజైన్ మాస్టర్ ఒల్లీవీర్‌ సేవియోతో కలిసి రియల్‌మీ పనిచేసింది.

కెమెరా క్వాలిటీ..ఈ రియల్‌మీ 12 ప్రో ప్లస్‌ ఫోన్లో 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ప్రకారం 3X ఆప్టికల్ జూమ్, 6X ఇన్-సెన్సర్ జూమ్‌తో పాటు OV64B సెన్సార్‌తో కూడిన అతిపెద్ద-ఇన్-క్లాస్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది.

డిస్‌ ప్లే వివరాలు.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120హెర్జ్‌ కర్వ్‌డ్‌ విజన్ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో 67వాట్ల సూపర్‌ వీఓఓసీ చార్జింగ్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్‌ మద్దు ఉంటుంది.

ధర, లభ్యత.. రియల్‌ మీ 12 ప్రో ప్లస్‌ 5జీ మూడు రంగులలో లభిస్తుంది. సబ్‌మెరైన్ బ్లూ, నావిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ రంగుల్లో ఉంటుంది. అలాగే మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 29,999గా ఉంటుంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమరీతో ఇంకో వేరియంట్‌ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 31,999గా ఉంది. అలాగే మరో వేరియంట్‌ 12జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్‌ ధర రూ. 33,999గా ఉంది.

రియల్‌ మీ 12 ప్రో 5జీ..

రియల్‌ మీ 12 ప్రో 5జీ 120హెర్జ్‌ కర్వ్‌డ్‌ విజన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌1 చిప్‌సెట్‌, 32ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 709 టెలిఫోటో కెమెరా, 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 882 మెయిన్‌ కెమరా 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో, డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది.

ధర, లభ్యత.. రియల్‌ మీ 12 ప్రో 5జీ రెండు రంగులలో వస్తుంది – సబ్‌మెరైన్ బ్లూ, నావిగేటర్ బీజ్. అలాగే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తోంది. 8 జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మెమరీ ధర రూ. 25,999కాగా.. 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమరీ రూ. 26,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..