Moto G24: ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా.? మోటో నుంచి బడ్జెట్ ఫోన్
మోటో జీ24 పేరుతో ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6000 ఎమ్ఏహెచ్ వంటి భారీ బ్యాటరీని అందిస్తున్నారు. 33 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడం ఈ బ్యాటరీ ప్రత్యేకంగా చెప్పొచ్చు...

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన పలు ఫోన్‌లను తీసుకొచ్చిన మోటోరోలా తాజాగా మరో స్టన్నింగ్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మోటోజీ24 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీన అధికారికంగా ఈ ఫోన్ సేల్ ప్రారంభంకానుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మోటోజీ24 అమ్మకానికి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మోటో జీ24 పేరుతో ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6000 ఎమ్ఏహెచ్ వంటి భారీ బ్యాటరీని అందిస్తున్నారు. 33 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడం ఈ బ్యాటరీ ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. 3డీ అక్రిలిక్ గ్లాస్ (పిఎంఎంఏ) ఫినిష్‌తో మంచి ఆకృతిలో ఆ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇంక్ బ్లూ, గ్లేసియర్ బ్లూ వంటి కలర్స్‌లో తీసుకురానున్నారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక 6.6 ఇంచెస్‌తో కూడిన పంచ్ హోల్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో డాల్బీ ఆట్మోస్ స్టీరియో స్పీకర్స్‌ను అందించారు. ఐపీ52తో కూడిన వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు.
మోటో జీ24 స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే… 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా ఉంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 750 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో రెండు వేరియంట్స్‌ను రూ. 8,249, రూ. 9,249కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




