- Telugu News Photo Gallery Technology photos iQoo offering price cut on iQoo neo 7 pro phone in india, Check here for full details
iQoo neo 7 pro: ఐకూ కొత్త ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 7వేలు తగ్గింపు..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ ఇటీవల భారత మార్కెట్లోకి ఐకూ నియో 7 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్ వేదికగా నిర్వహిస్తున్న సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 7 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 30, 2024 | 10:05 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ కొత్త ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐకూ నియో 7ప్రోపై అమెజాన్ లేటెస్ట్ సేల్‌లో ఏకంగా రూ. 7 వేల తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.

లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999కి ధరకు తీసుకొచ్చారు.ప్రస్తుతం సేల్‌లో భాగంగా బేస్ వేరియంట్ ఫోన్‌ను రూ. 27,999కి, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని రూ. 30,999కి సొంతం చేసుకోవచ్చు.

ఇక ఐకూ నియో 7 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ఇక ఐకూ నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో వర్చువల్ ర్యామ్‌ను పెంచుకునే ఫీచర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.




