PM Kisan Scheme: మీకు పీఎం కిసాన్ స్కీమ్‌ ద్వారా డబ్బులు అందుతున్నాయా..? అయితే ఈ యాప్ మీకోసమే

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌లో ఉన్న రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 9.5 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు..

PM Kisan Scheme: మీకు పీఎం కిసాన్ స్కీమ్‌ ద్వారా డబ్బులు అందుతున్నాయా..? అయితే ఈ యాప్ మీకోసమే
Follow us

|

Updated on: Jul 09, 2021 | 10:03 AM

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌లో ఉన్న రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 9.5 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పీఎం కిసాన్ డబ్బులను జమ చేసిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ పథకంలో ఎనిమిదో ఇన్‌స్టాల్‌మెంట్ ఇది. https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో లబ్దిదారుల జాబితా చెక్ చేసుకోవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ వెబ్‌సైట్‌తో పాటు ఇకపై రైతులు మొబైల్ యాప్ ద్వారా కూడా లబ్ధిదారుల జాబితా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మొబైల్ యాప్ రూపొందించింది. అయితే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (NIC) పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను తయారు చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో పీఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సైజ్ 20ఎంబీ ఉంటుంది.

ఈ యాప్‌ను ఇప్పటికే 50 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ చేయడం విశేషం. రైతులు ఈ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే యాప్‌లో లబ్ధిదారుల జాబితా కూడా సెర్చ్ చేయవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో పీఎం కిసాన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఈ యాప్‌లోనే రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. తమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.

తమకు రావాల్సిన పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ వివరాలు కూడా అందులో ఉంటాయి. ఇక ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరును సరిచేసుకోవాలన్నా యాప్ ద్వారా సాధ్యం అవుతుంది. పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 మూడు వాయిదాల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. అంటే ప్రతీ నాలుగు నెలలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తుంది.

ఇవీ కూడా చదవండి

Realme 5G Smartphones: భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తాం: రియల్‌మీ సీఈఓ మాధవ్‌

RBI: ఎస్‌బీఐతో పాటు మరో 13 బ్యాంకులకు ఝలక్‌ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా విధింపు.. ఎందుకంటే..!