AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో ప్ర‌భాస్‌కు మ‌రో ప్రతిష్ఠాత్మక అవార్డు !

‘బాహుబలి’ సినిమాతో హీరో ప్ర‌భాస్ అశేష‌ అభిమానుల‌ను సంపాదించుకోగ‌లిగారు. ‘బాహుబలి’ రెండు భాగాల తరువాత, భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు, ఎన్నో దేశాల్లో అభిమానులను పెంచుకున్న హీరో ప్రభాస్, ఇప్పుడు ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్నారు.

హీరో ప్ర‌భాస్‌కు మ‌రో ప్రతిష్ఠాత్మక అవార్డు !
Jyothi Gadda
|

Updated on: Jun 18, 2020 | 4:04 PM

Share
‘బాహుబలి’ సినిమాతో హీరో ప్ర‌భాస్ అశేష‌ అభిమానుల‌ను సంపాదించుకోగ‌లిగారు. ‘బాహుబలి’ రెండు భాగాల తరువాత, భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు, ఎన్నో దేశాల్లో అభిమానులను పెంచుకున్న హీరో ప్రభాస్, ఇప్పుడు ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్నారు. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందడంతో, ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డు ప్రభాస్ కు లభించింది. కాగా,  తన అద్భుతమైన నటనతో బాలీవుడ్  లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్, దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే అవార్డును అందుకోగా, ఆపై మరే ఇండియన్ నటుడికీ దక్కని ఘనత ప్రభాస్ కు దక్కింది.

‘శ్రీ 420’, ‘ఆవారా’, ‘ఆరాధన’ వంటి చిత్రాలతో రష్యా సినీ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్, గతంలో ఇదే అవార్డును అందుకున్నారు. తాజాగా, 2015 అవార్డులను ప్రకటించగా, ప్రభాస్ కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. ఇది ‘బాహుబలి’ చరిత్రలో మరో రికార్డుగా నిలువనుంది. ఈ చిత్రం జీవితానుభూతులను మించిన అనుభూతిని అందిస్తుందని, ముఖ్యంగా క్లయిమాక్స్ సీన్స్ ఒళ్లు జలదరించేలా ఉంటాయని, ఏ సమయంలోనైనా ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని ఈ సందర్భంగా అవార్డు కమిటీ తెలిపింది.

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్