6 నెలల్లో ఏడు చిత్రాలు కోల్పోయిన సుశాంత్…సంజయ్ నిరుపమ్

టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై రాజకీయ నేత సంజయ్ నిరుపమ్ షాకింగ్ వాస్తవాలు వెల్లడించారు. గత ఏడాదిలో వఛ్చిన 'చిచ్చోర్ ' మూవీ సక్సెస్ అనంతరం సుశాంత్ కేవలం ఆరు నెలల్లో ఏడు చిత్రాలను కోల్పోయాడని..

  • Umakanth Rao
  • Publish Date - 1:05 pm, Tue, 16 June 20
6 నెలల్లో ఏడు చిత్రాలు కోల్పోయిన సుశాంత్...సంజయ్ నిరుపమ్

టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై రాజకీయ నేత సంజయ్ నిరుపమ్ షాకింగ్ వాస్తవాలు వెల్లడించారు. గత ఏడాదిలో వఛ్చిన ‘చిచ్చోర్ ‘ మూవీ సక్సెస్ అనంతరం సుశాంత్ కేవలం ఆరు నెలల్లో ఏడు చిత్రాలను కోల్పోయాడని ఆయన ట్వీట్ చేశారు. అయితే అవి ఏ చిత్రాలో ఆయన వెల్లడించలేదు. సుశాంత్ మృతితో బాలీవుడ్ లోని చీకటి కోణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. సంజయ్ నిరుపమ్.. ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రూరత్వం మరో స్థాయికి చేరిందని, ఓ ప్రతిభ గల నటుడిని బలి గొందని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్ అంత్యక్రియలకు బడా నటుల్లో ఎవరూ హాజరు కాకపోగా.. సంజయ్ తో బాటు కృతి సనన్, శ్రధ్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, వివేక్ ఒబెరాయ్, దర్శక నిర్మాత అభిషేక్ కపూర్ మాత్రం హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా సుశాంత్.. తనను దూరం పెట్టారని బాధ పడుతూ వచ్చాడని సంజయ్ పేర్కొన్నారు. డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా తన ‘పానీ’ చిత్రాన్ని సుశాంత్ తో పూర్తి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిన్ను దిగజార్చాలని చూసినవారెవరో తనకు తెలుసునని, అవి తెలిస్తే నువ్వు నా భుజాలమీద వాలి శోకిస్తావని’ ఆయన ట్వీట్ చేశారు. ఇక.. వివేక్ ఒబెరాయ్ కూడా బాలీవుడ్ లోని మరో కోణాన్ని ఖండించాడు.