కొడుక్కి స్కూటీ ఇచ్చిన తండ్రి.. భారీ జరిమానాతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. జరిమానా ఎంతంటే..?

వాహనదారులూ జాగ్రత్త.. బైక్ నడిపేటపుడు హెల్మెట్ ధరించండి.. ట్రిపుల్ రైడింగ్ వద్దు.. డ్రంకన్ డ్రైవ్ వద్దు.. మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దు..

కొడుక్కి స్కూటీ ఇచ్చిన తండ్రి.. భారీ జరిమానాతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. జరిమానా ఎంతంటే..?

వాహనదారులూ జాగ్రత్త.. బైక్ నడిపేటపుడు హెల్మెట్ ధరించండి.. ట్రిపుల్ రైడింగ్ వద్దు.. డ్రంకన్ డ్రైవ్ వద్దు.. మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దు.. కార్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోండి.. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించండి.. అతి స్పీడ్ వద్దు.. అంటూ ప్రజల శ్రేయస్సును కోరి ట్రాఫిక్ పోలీసులు చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెబుతున్నారు. అయినా వినని ప్రజలకు అడపాదడపా జరిమానాలు విధిస్తూ కొంచెం భయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా ద్విచక్ర వాహన యజమానికి ఒడిశా ట్రాఫిక్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. మైనర్ బాలుడికి స్కూటీ ఇచ్చినందుకు ఊహించని రీతిలో జరిమానా విధించి సదరు వ్యక్తిని హడలెత్తించారు.

అసలు వివరాల్లోకెళితే.. భువనేశ్వర్‌లోని ఖండగరి ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు స్కూటీని నడిపాడు. ఈ తతంగం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ అధికారులు.. సదరు ద్విచక్ర వాహన యజమానిని గుర్తించి.. అతనికి భారీ జరిమానా విధించారు. మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించి స్కూటీని మైనర్ బాలుడికి ఇచ్చారనే ఆరోపణతో అతనికి రూ. 25 వేల జరిమానా విధించారు. అలాగే ఆ బాలుడు హెల్మెట్ ధరించనందుకు రూ. 1000 ఫైన్ వేశారు. ఇలా మొత్తంగా అతనికి రూ.26వేల ఫైన్ కట్టాలంటూ నోటీసులు పంపారు ట్రాఫిక్ అధికారులు. అంతేకాదు.. ఆ స్కూటీని నడిపిన బాలుడికి లైసెన్స్ కూడా లేకపోవడంతో ఆ స్కూటీని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులు అందుకున్న బండి యజమాని హడలిపోయాడు.