PM Modi: వారణాసి స్టేడియాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రధాని మోదీ.. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమీక్ష
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించారు. ఇక్కడ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా హారతిలో పాల్గొన్నారు. కాశీలో రోజంతా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ అకస్మాత్తుగా వారణాసి స్టేడియాన్ని తనిఖీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించారు. ఇక్కడ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా హారతిలో పాల్గొన్నారు. కాశీలో రోజంతా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ అకస్మాత్తుగా వారణాసి స్టేడియాన్ని తనిఖీ చేశారు. స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులపై సమీక్షించారు. ఇక్కడ నిర్మిస్తున్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సమయంలో ఆయన వెంట సీఎం యోగి కూడా ఉన్నారు. ఈ స్టేడియం సిద్ధమైన తర్వాత, ఇది యువత అవసరాలను తీర్చడంతోపాటు వారణాసిలో క్రీడా సంస్కృతిని మరింత మెరుగుపరుస్తుందని మోదీ పేర్కొన్నారు. రాత్రికి బనారస్ రైల్వే ఇంజిన్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌లో ప్రధాని మోదీ బస చేస్తారని అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం బీహార్‌కు బయలుదేరి వెళతారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో తొలిసారిగా పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయాన్ని సందర్శించే ముందు, మోదీ మెహదీగంజ్‌లో ప్రధాని కిసాన్ సమ్మేళన్‌లో ప్రసంగించారు. దశాశ్వమేధ్ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
“భారతదేశం పురోగతి, 140 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సు కోసం కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థించాను. మహాదేవుని దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. “పౌరులందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఆ దేవుడిని ప్రార్థించాను” అని ఆయన సోషల్ మీడియా వేదిక X లో పోస్ట్‌లో తెలిపారు.
Reviewed the progress at the Dr. Sampurnanand Sports Stadium in Kashi. This stadium and sports complex will greatly help the youth of Kashi. pic.twitter.com/VJt82v6GfZ
— Narendra Modi (@narendramodi) June 18, 2024
కాగా, బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభిస్తారు. కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోపాటు 17 దేశాల రాయబారులు హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ నలంద పురాతన శిధిలాల ప్రదేశానికి దగ్గరగా ఉంది. 2007లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన రెండవ తూర్పు ఆసియా సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి విశ్వవిద్యాలయం పునర్నిర్మాణం జరుగుతోంది. నలంద విశ్వవిద్యాలయం ఐదవ శతాబ్దంలో స్థాపించడం జరింగింది. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పురాతన విశ్వవిద్యాలయం 12 వ శతాబ్దంలో ఆక్రమణదారులచే నాశనం చేయబడటానికి ముందు 800 సంవత్సరాలు అభివృద్ధి చెందింది. కొత్త విశ్వవిద్యాలయం 2014లో 14 మంది విద్యార్థులతో తాత్కాలిక ప్రదేశం నుండి పనిచేయడం ప్రారంభించింది. యూనివర్సిటీ నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…