PM Narendra Modi: దేశం గర్విస్తోంది.. ఏడాది కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi on Covid-19 Vaccination: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో

PM Narendra Modi: దేశం గర్విస్తోంది.. ఏడాది కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2022 | 6:47 PM

PM Modi on Covid-19 Vaccination: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భారత్ మరో ఘనతను సాధించింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరిని ప్రధాని మోదీ ప్రశంసించారు. శాస్త్రవేత్తలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను అభినందించారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి వ్యాక్సినేషన్ గొప్ప బలాన్ని ఇచ్చిందని.. జీవితాలను, జీవనోపాధిని రక్షించడంలో కీలక పాత్ర పోషించిందని ఈ మేరకు ట్విట్ చేశారు.

టీకా కార్యక్రమానికి ఏడాది పూర్తయింది. దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాను. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి టీకా కార్యక్రమం గొప్ప బలాన్ని ఇచ్చింది. ప్రాణాలను రక్షించడానికి, జీవనోపాధిని కాపాడటానికి ఇది దోహదపడింది.. అంటూ మోదీ పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు ఈ సంక్షోభ సమయంలో నిర్వహించిన పాత్ర అసాధారణమైనదని.. ప్రశంసించారు. వీరంతా అసాధారణ సేవలు అందించారని ప్రధాని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు టీకా అందిస్తున్న దృశ్యాలు, హెల్త్‌కేర్ వర్కర్స్ టీకాలను అక్కడికి తీసుకెళ్తున్న దృశ్యాలు మన మనసులు, హృదయాలు గర్వంతో నిండిపోయేలా చేశాయని తెలిపారు.

మహమ్మారి మొదటిసారిగా వచ్చినప్పుడు వైరస్ గురించి పెద్దగా తెలియదన్నారు. అయినప్పటికీ మన శాస్త్రవేత్తలు, ఆవిష్కణకర్తలు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడంలో మునిగిపోయారని మోదీ అన్నారు. వ్యాక్సిన్‌ల ద్వారా మహమ్మారిని ఎదుర్కోవడంలో సహకరించినందుకు భారతదేశం గర్విస్తోంది.. అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఇది సాధ్యమైందంటూ ట్విట్ చేశారు. దేశ జనాభాలో దాదాపు 92 శాతం మంది టీకాలు పొందారంటూ పేర్కొన్నారు. దాదాపు 156 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు.

కాగా.. ఆదివారం ఉదయం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ లో దేశంలో ఇప్పటివరకు 156.76 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Hooch Tragedy: పండుగపూట విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి..

Vandalur Zoo: జూలో కరోనా కలకం.. 80 మంది సిబ్బందికి పాజిటివ్..