AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ..

PM Narendra Modi meets Bill Gates: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్ పర్యటన అనంతరం బ్రిటన్‌లోని గ్లాస్గోలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్‌-26 (COP26)

PM Narendra Modi: బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ..
Pm Narendra Modi Meets Bill
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2021 | 6:21 PM

Share

PM Narendra Modi meets Bill Gates: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్ పర్యటన అనంతరం బ్రిటన్‌లోని గ్లాస్గోలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్‌-26 (COP26) మీట్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌తో ప్రధాని మోదీ భేటీకావడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశంలో పెటుబడులు, ఉపాధి తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. అంతకుముందు రోజు ప్రధాని మోదీ నేపాలీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. భారత ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ (IRIS) కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రారంభించారు. కాగా.. COP26 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం గ్లాస్గో చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా – బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ సైడ్ ఈవెంట్‌కు కూడా ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు “యాక్సిలరేటింగ్ క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్” అనే అంశంపై జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అనంతరం ఈ రోజు రాత్రికి ప్రధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు.

కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26) 26వ సెషన్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ పలు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలపై మాట్లాడారు. దీంతోపాటు గ్లాస్గోలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులను కూడా కలిసి సంభాషించారు.

Also Read:

Punjab Lok Congress: కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

DGP Mahender Reddy: ‘మహిళలను వేధిస్తే.. దబిడి దిబిడే’.. నిరంతరం అందుబాటులో ఉమెన్‌ సేఫ్టీ వింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి