Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi in Gujarat: రైతుల ఉద్యమం వేళ అన్నదాతలకు భారీ గిఫ్ట్ ప్రకటించిన ప్రధాని మోదీ

బీజేపీ ప్రభుత్వం ఆలయాలను మాత్రమే కాకుండా పేదలకు కోట్లాది ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సొంత రాష్ట్రం గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అమూల్‌ డెయిరీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. వాలినాథ్ ఆలయంలో జరిగే పవిత్రోత్సవంలో పాల్గొన్నారు. ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన సిగ్నేచర్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Modi in Gujarat: రైతుల ఉద్యమం వేళ అన్నదాతలకు భారీ గిఫ్ట్ ప్రకటించిన ప్రధాని మోదీ
Pm Modi Gujarat Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 22, 2024 | 9:41 PM

బీజేపీ ప్రభుత్వం ఆలయాలను మాత్రమే కాకుండా పేదలకు కోట్లాది ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సొంత రాష్ట్రం గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అమూల్‌ డెయిరీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. వాలినాథ్ ఆలయంలో జరిగే పవిత్రోత్సవంలో పాల్గొన్నారు. ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన సిగ్నేచర్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను పురస్కరించుకుని రాష్ట్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మెహసానాలో రూ .22,850 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించారు. అమూల్‌ డెయిర్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు మోదీ. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ. గతంతో పోలిస్తే రైతుల సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. రైతుల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో తన ప్రసంగంలో వివరించారు. రైతుల ఆదాయం ఎలా పెరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు.

నేడు దేశంలో మొత్తం పాల ఉత్పత్తుల టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లకు పైమాటే అని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వరి, గోధుమలు, చెరకు కలిపి తయారు చేసిన ఉత్పత్తి మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు చేరడం లేదని అన్నారు. వరి, గోధుమలు, చెరకు పంటలతో రైతులు ఎదగవలసి ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఆదాయం పెరగాలంటే పాల ఉత్పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి తదితరాలపై దృష్టి సారించాలని మోదీ సూచించారు.

మెహసానాలో భారీ రోడ్‌షో నిర్వహించారు మోదీ. బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దివ్య రామమందిరం నిర్మాణం ఇప్పటికి కూడా కొందరు కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మోదీ. తాము మందిరాలతో పాటు పేదల కోసం కోట్లాది ఇళ్లను నిర్మిస్తునట్టు తెలిపారు. గుజరాత్‌లో కూడా లక్షలాదిమంది పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మించినట్టు తెలిపారు. దేశంలో ఓవైపు మందిరాలను నిర్మిస్తున్నాం.. మరోవైపు కోట్లాదిమంది పేదలకు పక్కా ఇళ్లను నిర్మిస్తున్నాం. కొద్దిరోజుల క్రితమే గుజరాత్‌లో లక్షా 20 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించామని మోదీ తెలిపారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇస్తున్నామని, పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

నవ్‌సారిలో పర్యటించారు మోదీ. భారీ రోడ్‌షో నిర్వహించారు. రూ. 18 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు సాగునీటి రంగానికి , రైతుల సంక్షేమానకి పెద్ద పీట వేసినట్టు తెలిపారు. అణువిద్యుత్‌ రంగంలో గుజరాత్‌ ముందుకు దూసుకెళ్తుందన్నారు మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…