PM Modi: రామేశ్వరంలో ప్రధాని మోదీ సముద్ర స్నానం.. శివుడికి ప్రత్యేక పూజలు.. వీడియో

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఉత్తరాదితోపాటు.. దక్షిణాదిలో రాముడితో ముడిపడి ఉన్న పుణ్య క్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 11 రోజులపాటు ఉపవాసం ఉంటూ.. ఆలయాలను దర్శించుకుంటున్నారు.

PM Modi: రామేశ్వరంలో ప్రధాని మోదీ సముద్ర స్నానం.. శివుడికి ప్రత్యేక పూజలు.. వీడియో
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 20, 2024 | 9:05 PM

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఉత్తరాదితోపాటు.. దక్షిణాదిలో రాముడితో ముడిపడి ఉన్న పుణ్య క్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 11 రోజులపాటు ఉపవాసం ఉంటూ.. ఆలయాలను దర్శించుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ శనివారం తమిళనాడులో పర్యటించారు. ముందుగా శ్రీరంగానికి చేరుకున్న ప్రధాని మోదీ.. రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్త్రాల్లో రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. రుద్రాక్షమాలతో జపం చేస్తూ సముద్రంలో స్నానం చేశారు. అంతేకాకుండా ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకుని పవిత్ర స్నానమాచరించారు. అనంతరం రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు.

వీడియో చూడండి..

అయితే, రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం రామేశ్వరం.. రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారుచేసి పూజించాడని నమ్ముతారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ