PM Modi: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతుందంటూ మోదీ ఆసక్తికర ట్వీట్..
ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసులో సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రశ్నలకైనా, ఓటుకైనా డబ్బులు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పును వెలువరించింది. ఏకగ్రీవ తీర్పు చెప్పిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. చట్టసభల్లో ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే.. ప్రజాప్రతినిధులు విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.

ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసులో సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రశ్నలకైనా, ఓటుకైనా డబ్బులు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పును వెలువరించింది. ఏకగ్రీవ తీర్పు చెప్పిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. చట్టసభల్లో ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే.. ప్రజాప్రతినిధులు విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. 1998లో ఇదే కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన.. తీర్పును కొట్టేస్తూ సుప్రీం బెంచ్ తీర్పును వెలువరించింది. సీతా సోరెన్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. పీవీ నరసింహారావు కేసులో 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పును, సోమవారం ధర్మాసనం కొట్టేసింది.. చట్టసభల్లో సభ్యులు డబ్బులు తీసుకున్నా, విచారణకు మినహాయింపు ఉంటుందని అప్పట్లో సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. రాజ్యాంగంలోని 105(2), 194 (2) ఆర్టికల్స్ ప్రకారం చట్టసభ సభ్యులకు ప్రివిలేజ్ విషయంపై సుప్రీంకోర్టు ఇవాళ భాష్యం చెప్పింది.
పార్లమెంటులో ఓటింగ్ కోసం లంచం తీసుకున్నందుకు ఎంపీలు/ఎమ్మెల్యేలకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపునిస్తూ 1998లో ఇచ్చిన తీర్పును బెంచ్ ఏకగ్రీవంగా తిరస్కరించింది. పీవీ నరసింహారావు కేసులో తీర్పుతో విభేదిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి, లంచాలు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును నాశనం చేస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు పేర్కొన్న పివి నరసింహ కేసు జార్ఖండ్ ముక్తి మోర్చా లంచాల కుంభకోణానికి సంబంధించినది. 1993లో జేఎంఎం సభ్యులు లంచం తీసుకోని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సిపిఐ(ఎం) ఎంపీలు నర్సింహరావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా.. నగదు తీసుకుని జేఎంఎం ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు తెలిపారంటూ అభియోగాలు మోపారు.
మోదీ ట్వీట్..
SWAGATAM!
A great judgment by the Hon’ble Supreme Court which will ensure clean politics and deepen people’s faith in the system.https://t.co/GqfP3PMxqz
— Narendra Modi (@narendramodi) March 4, 2024
కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.. సుప్రీం కోర్టు ఇచ్చిన గొప్ప తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తుంది.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది.. అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో షేర్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
