PM Modi : కాసేపట్లో యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు

PM Modi to visit Bengal, Odisha : యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాలను మరి కాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు...

PM Modi : కాసేపట్లో యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే..  ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు
Yaas Devastation
Follow us

|

Updated on: May 28, 2021 | 8:21 AM

PM Modi to visit Bengal, Odisha : యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాలను మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. సైక్లోన్ కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను ప్రధాన మంత్రి విమానంలో నుంచి పరిశీలిస్తారు. యాస్ తుఫాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికి గాను నిర్వహించే సమీక్ష సమావేశాలకు మోదీ అధ్యక్షత వహిస్తారు. బెంగాల్ లో నిర్వహించే సమీక్షా సమావేశంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. కాగా, తుఫాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రాష్ట్రాల్లో సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని పేర్కొంది. ఏరియల్ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా యాస్ తుఫాను తీరం దాటే సమయంలో బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రా​లను కుదిపేసిన సంగతి తెలిసిందే. యాస్ తుపాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 21 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వీరందరికీ తిండి, ఆవాస ఏర్పాట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు పరుస్తున్నాయి. ఈ పునరావాస కార్యక్రమాల గురించి కూడా మోదీ ఇవాళ సమీక్ష చేయనున్నారు.

ఇలా ఉండగా, తూర్పు తీరంలో విరుచుకుపడిన యాస్ తుఫాను ప్రభావంపై ప్రధానమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ, విద్యుత్, టెలికాం శాఖల కార్యదర్శులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ డీజీ ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Pm Modi Aerial Survey

Pm Modi Aerial Survey

Read also : Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో

పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?