PM Modi: ఇవాళ యూపీకి ప్రధాని మోడీ.. కాన్పూర్ ఐఐటి స్నాతకోత్సవంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మరోసారి ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. యూపీలోని కాన్పూర్ నగరాన్ని సందర్శించనున్నారు. ఇది కాకుండా, కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.

PM Modi: ఇవాళ యూపీకి ప్రధాని మోడీ.. కాన్పూర్ ఐఐటి స్నాతకోత్సవంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు
Pm Modi
Follow us

|

Updated on: Dec 28, 2021 | 6:52 AM

PM Modi Uttar Pradesh Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మరోసారి ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. యూపీలోని కాన్పూర్ నగరాన్ని సందర్శించనున్నారు. ఇది కాకుండా, కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. దీనితో పాటు, కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్, బినా పంకీ మల్టీప్రొడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ విభాగాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.

ప్రధాని మోడీ మంగళవారం కాన్పూర్‌లో పర్యటిస్తారు. పట్టణ ప్రాంతంలో పెరగుతున్న జనాభాకు రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంలో భాగంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు కాన్పూర్ పూర్తయిన మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొత్తం 9 కి.మీ పొడవు ఐఐటి కాన్పూర్ నుండి మోతీ జీల్ వరకు విస్తరించి ఉంది. అయితే, కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కి.మీ. ఇది రూ. 11,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో ప్రాజెక్టుగా కాన్పూర్ మెట్రో అవతరిస్తోంది.

నవంబర్ 15, 2019న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రారంభించారని, రెండేళ్లలోపు నవంబర్ 10, 2021న 9 కి.మీల IIT నుండి మోతీజీల్ ప్రాధాన్య కారిడార్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. అదే సమయంలో, ప్రధాని మోడీ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను కూడా పరిశీలిస్తారు. ఐఐటి మెట్రో స్టేషన్ నుండి గీతానగర్ వరకు మెట్రో రైడ్ కూడా తీసుకోనున్నారు. అలాగే, మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు, బినా పంకీ మల్టీప్రొడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

అలాగే, 356 కిమీ పొడవున్న బినా పంకీ మల్టీప్రొడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ సామర్థ్యం సంవత్సరానికి 3.45 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంతకుముందు, ఉదయం 11 గంటలకు కాన్పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 54వ స్నాతకోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతారు. కాన్వొకేషన్‌లో, నేషనల్ బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్ కింద ఇన్‌స్టిట్యూట్‌లో అభివృద్ధి చేయబడిన ఇన్‌ హౌస్ బ్లాక్‌చెయిన్ పవర్డ్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులందరికీ డిజిటల్ డిగ్రీని అందజేస్తారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత డిజిటల్ డిగ్రీలను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ డిజిటల్ డిగ్రీలు ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించడం జరుగుతుంది.

Read Also…  E-Shram Card: 15 కోట్లకుపైగా కార్మికుల రిజిస్ట్రేషన్లు.. ఈ పోర్టల్‌లో చేరితే బోలెడు లాభాలు.. అవేంటంటే?