PM Narendra Modi: చారిత్రాత్మక ఘట్టానికి ప్రధాని మోదీ శ్రీకారం.. ఒకేసారి 508 స్టేషన్ల ఆధునీకరణకు శంకుస్థాపన..
ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుండగా.. ఇందుకు రూ.24,470 కోట్ల వ్యయం చేయనుంది. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని..
చారిత్రాత్మక ఘట్టానికి మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వేలోని 50 స్టేషన్లకు మహర్దశ రాబోతుంది. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ మల్టీ పర్పస్ కేంద్రాలుగా మారిపోనున్నాయి. ఇక సిటీలోని రైల్వే స్టేషన్లు కొత్త కళను సంతరించుకోనున్నాయి.
దేశ వ్యాప్తంగా 508 మంది రైల్వే స్టేషన్లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుండగా.. ఇందుకు రూ.24,470 కోట్ల వ్యయం చేయనుంది. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఈ 508 స్టేషన్లు సరికొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 స్టేషన్‌ల పునరాభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణలో 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 15 స్టేషన్లు, మహా రాష్ట్రలో 13 స్టేషన్లు, కర్ణాటకలో 1 స్టేషన్‌కు కలిపి దాదాపు రూ.2.079.29 కోట్లతో రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన ఏబీఎస్‌ఎస్ విధానంలో భాగంగా పనులు జరగనున్నాయి. ఈ ఆధునికీకరణ పనుల ద్వారా రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు అన్నిరకాల ఆధునిక సౌకర్యాలు అందనున్నాయి. అలాగే నిర్ణీత రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ సర్క్యూలేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మన హైదరాబాద్‌లోని నాంపల్లి, మల్కాజిగిరి, హఫీజ్‌పేట్, మలక్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ స్టేషన్లను మొదటి దశలో పునరభివృద్ధి చేయనున్నారు. ప్రతి స్టేషన్‌కు దాదాపు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. తద్వారా ఈ స్టేషన్లు కొత్త రూపు పొందనున్నాయి. ఆదివారం నాడు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై హాజరుకానున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా.. స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లో స్వచ్ఛత ఉండేలా చూడటం, ప్రయాణీకులు వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించేలా పనులు చేపబడుతోంది కేంద్రం. దాంతోపాటు స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’ దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటి ఏర్పాట్లు చేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..