Ganga Vilas: రివర్ క్రూయిజ్ ‘గంగా విలాస్’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. దీని స్పెషాలిటీస్ తెలిస్తే వావ్ అంటారు..
రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్'ను ఈనెల 13న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ ప్రయాణం చేసే యాత్రను జెండా ఉపి ప్రారంభిస్తారు ప్రధాని మోదీ.
రివర్ క్రూయిజ్ ‘గంగా విలాస్’ను ఈనెల 13న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ ప్రయాణం చేసే యాత్రను జెండా ఉపి ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు ఈ ప్రయాణం ఉంటుంది. 50 రోజుల్లో దాదాపు 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్రూయిజ్ అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఆగి, అనేక జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా వెళుతుంది. 27 నదుల గుండా ఈ లగ్జరీ క్రూయిజ్ సాగనుంది. అంతేకాకుండా ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా వారసత్వ సంపదలుగా భావించే 50ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ నౌక ఆగుతుంది.
ఈ నౌక 20వ తేదీన ఫరక్కా, ముర్షిదాబాద్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి 15 రోజుల పాటు ప్రయాణిస్తుంది. తర్వాత మళ్లీ శివసాగర్ సమీపంలో భారత సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. గాజీపూర్, బక్సర్,పాట్నా మీదుగా కోల్‌కతా చేరుకుంటుంది. గంగ, బ్రహ్మపుత్ర నదులపై సాగుతుంది. సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, అబ్జర్వేటరీ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రయాణికులు ఆస్వాదిస్తారు. గంగా, బ్రహ్మపుత్ర నదులపై 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పవిత్ర వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు ప్రయాణిస్తుందీ నౌక. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది యాత్రగా రివర్ క్రూయిజ్ గంగా నిలవనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..