PM Modi: పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌ ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి.. సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసిన ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్‌గఢ్‌లోని పవిత్ర పార్వతీ కుండ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. అనంత‌రం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు.

PM Modi: పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌ ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి.. సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసిన ప్రధాని మోడీ
Pm Narendra Modi In Uttarakhand
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2023 | 10:48 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్‌గఢ్‌లోని పవిత్ర పార్వతీ కుండ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. అనంత‌రం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కైలాస శిఖరం ముందు కాసేపు కూర్చుని ధ్యానం చేశారు. ఆపై అక్కడి జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని కూడా సందర్శించారు. భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్‌కు వచ్చిన తొలి ప్రధాని నరేంద్ర మోడీయే కావడం విశేషం. ఈ సందర్భంగా గుంజీ గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు ప్రధాని. అక్కడి గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసలు కురిపించారు. అనంతరం తన పర్యటన వివరాలను ట్విట్టర్‌ వేదికగా అందరితో పంచుకున్నారు. ‘ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతి కుండ్‌లో దర్శనంతో నేనెంతో సంతోషించాడు. ఇక్కడ పూజ‌లు నిర్వహించి నేనెంతో పొంగిపోయాను. ఇక్కడ జ‌రిగిన ఆది కైలాస దర్శనంతో నా మనసు కూడా ఎంతో సంతోషించింది. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

తాజాగా ఉత్తరాఖండ్‌ పర్యటనకు సంబంధించిన మరిన్ని ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు ప్రధాని మోడీ. ‘ఉత్తరాఖండ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఏమిటని ఎవరైనా అడిగితే.. కుమావోన్ ప్రాంతంలోని పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాల పేర్లను చెబుతాను. వీటిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, దైవత్వం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. నిజం చెప్పాలంటే.. ఉత్తరాఖండ్‌లో సందర్శించదగిన ప్రదేశాలు చాలు ఉన్నాయి. పర్యాటకులు కూడా అధికంగా ఇక్కడికి వస్తుంటారు. నేను కూడా చాలా సార్లు ఈ రాష్ట్రాన్ని సందర్శించాను. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పవిత్ర స్థలాలకు వెళ్లాను. ఈ ప్రదేశాలు నాకెంతో మధురానుభూతిని మిగిల్చాయి. అయితే పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాలకు సందర్శించుకోవడం మాత్రం నా జీవితంలో మర్చిపోలేను’ అని రాసుకొచ్చారు మోడీ.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ షేర్ చేసిన ఫొటోలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..